PM Modi at ASEAN Summit: Need global resolve, strategies to combat terrorism

Terrorism no peripheral problem for southeast asia pm modi at asean

Prime Minister Narendra Modi, 10th East Asia Summit, Terrorism, Asean Summit, Indian flag, Narendra Modi, Shinzo Abe, Association of Southeast Asian Nations (ASEAN), ASEAN Business and Investment Summit, Malaysia, Japan PM Shinzo Abe, Narendra Modi

Modi called for a new global resolve and new strategies to combat terrorism, without balancing it against political considerations.

విషనీడ ప్రపంచమంతా పరుచుకుని వుంది.. ఐక్య సంకల్పం అవసరం..

Posted: 11/22/2015 02:25 PM IST
Terrorism no peripheral problem for southeast asia pm modi at asean

ఉగ్రభూతాన్ని ఇన్నాళ్లు ఆసియాకు సంబంధించిన సమస్యగా మాత్రమే చూశారని, దాని విషనీడ ఇప్పుడు  ప్రపంచమంతా పరుచుకొని ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం ఇంక ఎంతమాత్రం ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, లేక కాంటినెంట్ కో సంబందించిన అంశం కాదని ఆయన అన్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న 10వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే..

'ఈ ఫోరంలో మనం చాలాసార్లు అనుకున్నాం.. మన ప్రాంతానికి ఉగ్రవాద సమస్య ఉందని. కానీ, పారిస్, అంకారా, బీరుట్‌, మాలి, రష్యా విమానంపై ఇటీవల జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడులు.. ప్రపంచమంతా ఉగ్రవాద నీడ పరుచుకుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉగ్రవాద నియామకాలు, దాడుల లక్ష్యాలకు మన సమాజాలన్నీ బాధితులేనని చాటుతున్నాయి' అని మోదీ పేర్కొన్నారు. 'ఉగ్రవాదం అణచివేసేందుకు మనం అంతర్జాతీయ సంకల్పాన్ని తీసుకొని సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరముంది. రాజకీయాలు తావులేకుండా ఈ విషయంలో వ్యవహరించాలి' అని మోదీ ఆసియా దేశాలకు సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prime Minister Narendra Modi  10th East Asia Summit  Terrorism  

Other Articles

Today on Telugu Wishesh