India U-19 cricketers surprised with Afghanistan's brilliant gameplay

India u 19 register second win beat afghanistan

pacer Avesh Khan, tri-series opener Match, ricky bhui, Mehidy Hassan Miraz, cricket, team india, rahul dravid, india, kolkata, afghanistan, bangladesh, under -19 Tri Series, India U-19 Team, U-19 World Cup, india afghanistan, rishab pont

The Indian Under-19 cricket team registered their second successive win in the tri-series as they beat Afghanistan by 33 runs at the Jadavpur University ground.

క్రికెట్ ముక్కోణపు సిరీస్ లో టీమిండియా వరుసగా రెండవ విజయం..

Posted: 11/21/2015 07:08 PM IST
India u 19 register second win beat afghanistan

టీమిండియా, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్ అండర్-19 ముక్కోణపు సిరీస్ లో భారత కుర్రాళ్లు మరోసారి అదరగొట్టారు. నిన్న బంగ్లాదేశ్ పై సాధించిన విజయపు ధీమాతో రంగంలోకి దిగిన భారత్ ఆటగాళ్లు.. ఇవాళ ఆఫ్ఘానిస్థాన్ తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించారు. అప్ఘనిస్థాన్ పై భారత్ 33 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ విసిరిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘానిస్థాన్ పోరాడి ఓడింది. ఆఫ్ఘాన్ ఆటగాళ్లలో ఓపెనర్లు హజర్ తుల్లా (21), ఇస్మాతుల్లా(25) ఫర్వాలేదనించగా, చివర్లో రషిద్ ఖాన్(43), మహ్మద్ సర్దార్(33) లు ఆకట్టుకున్నారు.

కాగా, మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో ఆఫ్ఘాన్ 47.3 ఓవర్లలో 203 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా, ప్రమాణిక్, లామ్రోర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 236 పరుగులు చేసింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పాంట్ (87), మహిపాల్ లామ్రోర్ (43)లు బ్యాట్ ఝుళిపించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  afghanistan  Under-19 triseries  

Other Articles