Inverted Indian flag hoisted in ASEAN summit; Japanese PM notices, PM Modi finds nothing amiss

Asean summit tricolour upside down as modi abe shake hands

Asean Summit, Indian flag, Narendra Modi, Shinzo Abe, Association of Southeast Asian Nations (ASEAN), ASEAN Business and Investment Summit, Malaysia, Japan PM Shinzo Abe, Narendra Modi, Indian flag

In a huge insult to the country, an inverted national flag was hoisted in ASEAN summit by the organisers. Prime Minister Narendra Modi had a meeting scheduled with Japanese PM Shinzo Abe.

ITEMVIDEOS: జపాన్ లో జాతీయజెండాకు అవమానం.. ఆయన గుర్తించినా.. ఈయన కనిపెట్టలేదు..

Posted: 11/21/2015 06:57 PM IST
Asean summit tricolour upside down as modi abe shake hands

జపాన్ రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్‌ జాతీయ జెండాకు పరాభవం ఎదురైంది. జపాన్ లో భారతీయ జాతీయ జెండాను తలకిందలుగా ఎగురవేశారు. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిన్జో అబె ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ముందు ఫొటోల కోసం మీడియాకు ఇచ్చిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చలకు ముందు లాంఛనంగా మోదీ-అబె కరచాలనం చేస్తుండగా.. వారి వెనుక రెండు దేశాలు జెండాలు ఎగరేసి ఉన్నాయి.

భారత జాతీయ త్రివర్ణ పతాకంలో మొదట కాషాయ  వర్ణం, మధ్యలో తెలుపు రంగు, చివరన ఆకుపచ్చ వర్ణం ఉంటాయి. తిరగేసి ఎగురవేయడంతో మొదట ఆకుపచ్చ రంగుతో జాతీయ జెండా కనబడింది. అధికార వర్గాలు ఆదరాబాదరాగా ఏర్పాట్లు చేయడంతో ఏమారపాటు వల్లో, ఆ జాగ్రత్త వల్లో ఇలా జరిగిందని, ఇది దురదృష్టకరమని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ తప్పిదాని జపాన్ ప్రధాని అబె గమనించారు. కానీ మన ప్రధాని మాత్రం తప్పును కనిపెట్టలేకపోయారు. కౌలాలంపూర్‌లో జరుగుతున్న 13వ ఆసియన్-భారత్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ- జపాన్ ప్రధాని అబెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.


కాగా ఈ ఘటనపై నెట్ జనులు మాత్రం ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాద్యమాల్లో స్పందించారు. జాతీయవాది మోది ఈ తప్పును ఎలా గుర్తించలేకపోయారని కొందరు విస్మయం వ్యక్తం చేశారు. మోడీ గారు కెమెరాలకు ఫోజుల్లిచ్చేందుకు ముందుటారు కానీ, తన వెనుక ఎం వుందో కూడా పట్టించుకోరు.. ఆయనను నిందించకండని మరికోందరు స్పందించారు. ఇతరులు చేసే తప్పులలో చిన్న చిన్న అంశాలను పెద్దగా చూపే మోదీకి.. తన సమక్షంలో జాతీయ పతాకానికి జరిగిన అవమానంపై ఎలా స్పందిస్తారో అంటూ మరికోందరు ప్పందించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asean Summit  Indian flag  Narendra Modi  Shinzo Abe  

Other Articles