clashes between bride and bridegroom relatives in a reception for not surving mutton good | marriage controversies | marriage fights

Bride and bridegroom relatives clash for not surving mutton good

marriage clashes, marriage fights, marriage controversies, bride and grooms fight, marriage news, mutton fight in marriage, mutton fight in reception

bride and bridegroom relatives clash for not surving mutton good : big clash between bride and bridegroom relatives in a reception for not surving mutton good

విందులో మటన్ సరిగ్గా వడ్డించలేదని..

Posted: 11/21/2015 07:53 AM IST
Bride and bridegroom relatives clash for not surving mutton good

అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ పెళ్ళిలో ఓ యువకుడు చేసిన తెలివితక్కువ పనికి.. వధూవరుల బంధువుల మధ్య భారీ ఘర్షణకు దారితీసింది. విందులో తనకు మటన్ సరిగ్గా వడ్డించలేదని ఆగ్రహించిన ఆ యువకుడు.. తన ప్లేటులో విసిరేశాడు. అది పెళ్ళి కూతురు తరఫున బంధువులపై పడటంతో అతనిని చితకబాదారు. ఆ విషయం తెలుసుకున్న ఆ యువకుడి బంధువులు మూకుమ్మడిగా వాడిపై దాడి చేశారు. ఈ విధంగా రెండువర్గాల మధ్య గొడవ జరిగింది.

శేరిలింగంపల్లి సురభీ కాలనీకి చెందిన మణికంఠ అనే వ్యక్తికి బాచుపల్లి మల్లంపేటకు చెందిన రజనితో ఈ నెల 18వ తేదీన ఘనంగా వివాహం జరిగింది. గురువారం సురభీ కాలనీలోని పెళ్లికొడుకు నివాసం వద్ద విందు ఏర్పాటు చేశారు. అప్పటివరకు అక్కడి వాతావరణం ఓ పండుగలా వుండేది. బంధువులు అందరూ సరదాగా గడిపారు. కానీ.. ఇంతలోనే ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సురభీ కాలనీకి చెందిన ఒక యువకుడు తనకు మటన్ సరిగ్గా వడ్డించలేదని ఆగ్రహావేశంతో ప్లేటు విసిరేశాడు. అతను విసిరిన ఆ ప్లేటు.. పెళ్లికూతరు తరఫు బంధువలపైన పడింది. ఆగ్రహానికి గురైన వారు.. అతన్ని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. మల్లంపేట వాసులపై దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాల వారు తమతమ వారిని కొడుతున్నారంటూ ఆగ్రహానికి గురై తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఈ గొడవ మరింత చిలికి పెద్దగా కాకూడన్న భావనతో.. ఇరువర్గాలకు చెందిన పెద్దలు సర్దిచెప్పి పంపించివేయడంతో అర్ధరాత్రి దాటాక మల్లంపేటకు వెళ్లిపోయారు. దాంతో ఆ వివాదానికి తెరపడిందని అంతా అనుకున్నారు కానీ.. అలా జరగలేదు.

శుక్రవారం మధ్యాహ్నం తిరిగి మల్లంపేట గ్రామం నుంచి సుమారు 30 మంది వివిధ వాహనాలలో వచ్చి, సురభీ కాలనీ వాసులపై ఆకస్మాత్తుగా దాడికి దిగారు. కాలనీ పక్కనే రైల్వే ట్రాక్ ఉండటంతో అక్కడున్న కంకర్ రాళ్లతో దాడి చేయడంతో సురభీ కాలనీకి చెందిన కొందరు తీవ్ర గాయాలపాలవ్వగా.. మరొక వ్యక్తి వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న చందానగర్ ఎస్సై రామారావు.. అదనపు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, ఇరువర్గాలకు చెందిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ఇరువర్గాలు ఒకరిపై కొకరు ఫిర్యాదులు చేసుకోవడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marriage clashes  muttong fight in marriage  

Other Articles