Jammu: Cop Suspended After Seen in Pictures Sitting on Woman Officer's Lap

Cop seen in pictures sitting on woman spo s lap suspended

jammu, jammu cop, budhal police station constable, Rajouri District,, jammu cop photos, jammu cop on womans lap photos, jammu cop spo, jammu cop suspended, jammu woman spo, jammu latest news, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women,

Two pictures were posted on Facebook and Whatsapp in which Head Constable Zakir Hussain was seen sitting in the lap of a woman SPO who was seated on a chair in Budhal Police Station.

ఒళ్లో కూర్చోని సరదా పడ్డాడు.. అలా దూల తీర్చుకున్నాడు..

Posted: 11/20/2015 09:59 PM IST
Cop seen in pictures sitting on woman spo s lap suspended

ఆకతాయిల తాట తీసే పోలీసులే.. అకతాయి పనులకు పాల్పడితే.. ఇంకేముంది.. అది పెద్ద అంశంగా మారుతుంది. ఇది తెలిసి కూడా ఓ పోలీసు ఉన్నతాధికారి అకాతాయి కార్యానికి పాల్పడి.. ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అంతేకాదండోయ్ తాను చేసిన అకతాయి పనిని పలువురు మెచ్చుకోవాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఆ పని చేస్తూ.. ఫోటో దిగి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరీ సరదా తీర్చుకున్నాడు. ఇలా సరదా పడిన ఆ పోలీసు అధికారికి ఉన్నతాధికారులు మంచి గిప్ట్ ఇచ్చారు.  

అదేంటంటారా..? ఉన్న పళంగా ఉద్యోగంలోంచి సస్సెండ్ చేశారు. ఇప్పుడు తాను చేసిన పని ఎంత వెలం వెర్రిదో అర్థమయ్యాక.. ఉన్నతాధికారులు కాళ్లు, చేతులు పట్టుకుని తన సస్సెన్సన్ ఎత్తివేయాలని కోరుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్లోని  రాజౌరి జిల్లా  పోలీస్ స్టేషన్  కార్యాలయంలో ఓ మహిళా స్పెషల్ పోలీస్ ఆఫీసర్  ఒడిలో... హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ కులాసాగా కూర్చున్నాడు. అలా  ఎందుకు కూర్చున్నాడో  తెలియదు కానీ, ఈయన గారి  నిర్వాకాన్ని ఎవరో ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేశారు.

పోలీస్స్టేషన్లో మహిళా పోలీస్ కుర్చీలో కూర్చొని ఉండగా  ఆమె ఒడిలో  మరో పోలీసు కూర్చొని ఉండడం ఈ ఫోటోలో స్పష్టంగా ఉంది. ఆ ఫోటో కాస్తా, ఆ ఫోనూ, ఈ ఫోనూ చేరి, చివరికి  పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో  హెడ్ కానిస్టేబుల్ జకీర్ హుస్సేన్ను అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే  మహిళా స్పెషల్ ఆఫీసర్పై విచారణకు ఆదేశించారు. అలాగే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి  అసభ్యకర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.కాగా తన తప్పును మన్నించమని హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూ.. కాళ్లా వేళ్లా పడుతున్నాడు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడమంటే ఇది కాక మరేమిటి..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police  woman spo  lap  sitting  suspenstion  

Other Articles