Heavy rains in AP and Tamilnadu

Heavy rains in ap and tamilnadu

TamilNadu, Ap, Heavy Rains, Heavy Rains, Rains in AP, Chennai, Chandrababu Naidu, Rains AP dists

Steady rain in most parts of coastal Tamil Nadu due to a depression over Bay of Bengal put normal life out of gear on Monday. Floods have so far claimed 59 lives in the state. As many as 15 district administrations, including Chennai, have declared a holiday for schools and colleges.

ఆకాశానికి చిల్లుపడిందేమో...? వర్ష భీభత్సం

Posted: 11/16/2015 01:29 PM IST
Heavy rains in ap and tamilnadu

తమిళనాడుతో పాటు ఏపిలో వర్ష భీభత్సం జనాలను అతలాకుతలం చేసేస్తోంది. గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్రవంతి స్తంభించిపోయింది. చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ వాగులు వంకలు.. పొంగిపొర్లుతుండటంతో రవాణాకు, విద్యుత్ కు అంతరాయం కలుగుతోంది. చిత్తూరులో వర్షం భీభత్సానికి స్కూల్లకు సెలవు ప్రకటించారు. చెన్నైలోనూ భయంకరంగా వర్షం కురుస్తుండటంతో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.

Also Read: వణికిస్తున్న వర్షాలు.. తమిళనాట, ఏపిలో విస్తారంగా వర్షాలు

అల్పపీడన ప్రభావంతో.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో తిరుమల సహా అన్ని ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నదీ ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలోని కాళంగి, మల్లెమడుగు రిజర్వాయర్లతో పాటు తిరుమలలో గోగర్భం, పాపవినాశనం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జలాశయం నిండిపోవడంతో అధికారులు 4  గేట్లను ఎత్తారు. అల్పపీడన ప్రభావంతో తిరుమలలో జోరు వానలు పడుతున్నాయి. శ్రీవారి ఆలయం పరిసరాలు నీటితో నిండిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా వర్షం నీటితో రెండో ఘాట్ లో రోడ్డు కుంగిపోయింది. భారీ వర్షాలకు తిరుమలలోని జలశయాల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. గోగర్భం, పాపవినాశనం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంత మండలాల్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరుల్లో జోరుగా వర్షం కురుస్తోంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగానూ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నగరంలో గాంధీనగర్, ఆర్టీసీ కాలనీలు జలమయ్యాయి. జిల్లాలోని పలు గ్రామల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. వాణిజ్య పంటలు వేసుకున్న రైతులు..ఈ వర్షాల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు..వర్షాలపై పలు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TamilNadu  Ap  Heavy Rains  Heavy Rains  Rains in AP  Chennai  Chandrababu Naidu  Rains AP dists  

Other Articles