Central Minister Hans Raj slams telangana cm KCR

Central minister hans raj slams telangana cm kcr

KCR, Telangana Govt, warangal, Elections, TRS party in Warangal, Warangal Elections, Hans Raj, Central Minister Hans Raj, Hans Raj Comments on KCR

warangal elections getting more colourfull and more interesting. central Minister hans Raj slams TRS govt. He said that KCR didnt give jobs to any body but he gave three jobs for his family members.

కేసీఆర్ ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలు

Posted: 11/16/2015 01:12 PM IST
Central minister hans raj slams telangana cm kcr

వరంగల్ ఉప ఎన్నికల మీద అన్నీ పార్టీలు దృష్టిసారించాయి. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఇప్పటికే మంత్రలు, ముఖ్య నేతలు పర్యటనల మీద పర్యటనలు చేస్తూనే ఉన్నారు. దాంతో బిజెపి, టిడిపి అభ్యర్థి గెలుపు కోసం బిజెపి పార్టీ నాయకులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా కేంద్ర మంత్రి హన్స్ రాజ్ వరంగల్ ఉప ఎన్నికల్లో పాల్గొన్నారు.
అధికార పార్టీ టార్గెట్ గా అస్త్రాలు సంధిస్తున్నారు. మాటిమాటికి ఉప ఎన్నికలు తేవడం కెసిఆర్ కు అలవాటే అని కేంద్ర ఎరువులు, రసాయన శాఖల మంత్రి హన్స్ రాజ్ గంగారం అహిర్ ఎద్దేవా చేశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే...వరంగల్ ను తెలంగాణ రెండో రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: వరంగల్ వార్ వన్ సైడ్: ఎంపీ కవిత 

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి హన్స్ రాజ్ వెల్లడించారు. ఇంటికో ఉద్యోగమన్నమాట దేవుడెరుగు... కేసీఆర్ ఇంట్లో మాత్రం ముగ్గురికి మంత్రి కొలువులు వచ్చాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హామీలను నెరవేర్చలేని టీఆర్ ఎస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ శక్తివంతమైన పార్టీలన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదని ఒప్పుకుంటే  కేంద్రం ఇవ్వడానికి సిద్దంగా ఉందన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. టీఆర్ ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న బీజేపీ, టీడీపీ నేతలు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే రాష్ట్ర మంత్రులందరూ వరంగల్లోనే ఎందుకు ఉంటారని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles