How many days KCR took Telangana card

How many days kcr took telangana card

KCR, telangana, Telangana Sentiment, Telangana State, Telangana card, KCR on Warangal elections, Warangal Elections

Telangana CM KCR always trying to take Talnagana card in emergency situation. He will caught sentiment in people and geting votes in elections.

కేసీఆర్ తెలంగాణ కార్డు ఎన్ని రోజులు పట్టుకుంటాడు..?

Posted: 11/16/2015 02:00 PM IST
How many days kcr took telangana card

తెలంగాణ సిఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రతీసారి అందుకునే మాట తెలంగాణ వాదం. తాజాగా వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణవాదం అందుకున్నారు. టిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన ప్రతిసారి స్థానికులకే ఓటు వెయ్యాలని.. తెలంగాణ వాదాన్ని గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఎన్నిసార్లు ఇలా తెలంగాణవాదాన్ని అంటి పెట్టుకుంటారు అన్నది ప్రశ్న. ఎందుకంటే ఏడాదిన్నర తర్వాత కూడా కేసీఆర్ తెలంగాణవాదాన్ని పట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్ అన్నది చాలా మంది ప్రశ్న. తెలంగాణ అభివృద్ది.. తెలంగాణలో మారిన పరిస్థితుల గురించి ఎన్నికల్లో ప్రచారం చెయ్యాల్సింది పోయి.. అదే పాట.. తెలంగాణపాట పాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్న.

Also Read: పేపర్ పులిలా మారిన జగన్

తెలంగాణవాదం లేకుండా గెలవలేరా..?
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తమ పార్టీ సిద్దాంతాల్లో తెలంగాణ ప్రాధాన్య అంశం అన్న విషయం అందరికి తెలుసు. అయితే కేసీఆర్ వల్లో లేదా రకరకాల కారణాల వల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే ముందు నుండి కూడా మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అభివృద్ది పదాన నడిపించడంలో కాస్త వెనుకబడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపిలో పరిస్థితి వేరేలా ఉంది.. అక్కడ కనీసం రాజదాని కూడా లేదు.. పరిశ్రమలు, పెట్టుబడులు లేవు కానీ అన్నీ ఉన్నా కానీ అభివృద్దిలో మాత్రం వెనుకే ఉంది తెలంగాణ. అయితే దీన్ని కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణవాదాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు.

Also Read: పవన్ వల్ల కేసీఆర్ కు ముప్పు తప్పదా..?

తెలంగాణ పసెంటిమెంట్ ను ఎన్ని రోజులు వాడుకుంటారు..? ఎన్నాళ్లు ప్రజలకు అరచేతిలో చుక్కలు చూపిస్తారు అంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ తెలంగాణ కార్డు లేకుండా గెలుస్తాడా..? అంటే చెప్పలేమని సమాధానం వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవన పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదు. మరి అలాంటప్పుడు మార్సును కోరుకునే వారు ఎలా ఓటు వేస్తారు..? ఎందుకు ఓటు వేస్తారు..? కాగా వరంగల్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మంగా బావిస్తున్నారు కేసీఆర్. అందుకే మంత్రులను ఎన్నికల ప్రచారానికి పురమాయిస్తున్నారు. తెలంగాణ ఏర్సడిన పరిస్థితులు ఏంటి అన్న దాని మీద కనీసం ప్రభుత్వమైనా క్లారిటీతో ఉంటే అప్పటికి కానీ తెలంగాణ కార్డు లేకుండా టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందేమో అని విమర్శుకులు బావిస్తున్నారు. ఏ దిక్కు లేని వాళ్లకు గోదారే దిక్కు అన్న చందాన.. చేతిలో ఎలాంటి అవకాశాలు లేనప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటే టిఆర్ఎస్ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles