police registered attempt murder case against mla vivek

Attempt murder case on qutbullapur mla vivekananda goud

jeedimetla police, atempt murder case, Vivekananda Goud, K.M. Vishal, Qutbullapur TDP MLA Vivek, K.M pratap, Congress senior leader K.M pratap, chintal

jeedimetla police registered atempt murder case on Qutbullapur TDP MLA Vivekananda Goud and another case on Congress senior leaders Pratap's son Vishal

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు.. నమోదు చేసిన పోలీసు

Posted: 11/13/2015 09:48 AM IST
Attempt murder case on qutbullapur mla vivekananda goud

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేత, ఆ పార్టీ యువ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. దాయాధుల మధ్య వున్న వివాదాస్పద స్థలం విషయంలో రేగిన వివాదమే ఇందుకు కారణమైంది. రంగరెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేకానంద్ కు తన సొంత బాబాయి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ గౌడ్ తో విభేదాలున్నాయి. హైదరాబాదు శివారు ప్రాంతం చింతల్ లో వీరికి చెందిన ఓ స్థలం వివాదంలో ఉంది. కాగా, దీపావళి సందర్భంగా సదరు స్థలంలో వివేకానంద్ ఆదేశాలతో హరికృష్ణ అనే వ్యక్తి టపాసుల దుకాణాన్ని ఏర్పాటు చేశాడు.

విషయం తెలుసుకున్న కేఎం ప్రతాప్ కుమారుడు కేపీ విశాల్, వివాదాస్పద స్థలంలో దుకాణం ఎలా ఏర్పాటు చేశావని హరికృష్ణను నిలదీశారు. దీనిపై సమాచారం అందుకున్న వివేకానంద్ అక్కడికి చేరుకోగా, ఇద్దరు అన్నదమ్ములు వివేకానంద్, విశాల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో విశాల్ పై వివేకానంద్ చేయి చేసుకున్నారు. దీంతో వివేకానంద్ తనపై దాడి చేశారని, తనను హత్య చేసేందుకు యత్నించారని విశాల్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివేకానంద్ పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు తనను డబ్బులివ్వాలని బెదిరించారని టపాసుల దుకాణ యజమాని హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాల్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jeedimetla police  atempt murder case  Vivekananda Goud  K.M. Vishal  

Other Articles