YS Jagan like a paper tiger

Ys jagan like a paper tiger

YS Jagan, Jagan, AP, AP Politics, JaganMohanReddy, YS JaganMohan Reddy, YSRCP

YSRCP Leader YS Jagan like a paper tiger in ap politics. Jagan always trying to behave like a tiger but actually he becomes a paper tiger.

పేపర్ పులిలా మారిన జగన్

Posted: 11/13/2015 10:46 AM IST
Ys jagan like a paper tiger

ఏపిలో బలమైన ప్రతిపక్షనేత, వైసీపీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దారుణంగా మారింది. తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీద ఠారెత్తి మాట్లాడే జగన్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అన్నది ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశం. జగన్ వీలు దొరికినప్పుడల్లా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓదార్పు యాత్రల నుండి, రైతు యాత్ర, భరోసా యాత్ర అంటూ ప్రజల వద్దకు వెళుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఏపికి ప్రత్యేక హోదా కోసం చేసిన దీక్ష కు కూడా భారీ ఖర్చు చేసి జనాలను పొగేసినట్లు తెలుస్తోంది. మరి ఆంతలా కష్టపడుతున్నా కానీ జగన్ ట్రాక్ లోనే ఉన్నాడా..? లేదా ఏపిలో కేవలం పేపర్ పులిలా మారాడా..? అన్న అనుమానాలు చాలా మందికి కలుగుతున్నాయి.

వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఏపి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మీద, ఏపి ప్రభుత్వం మీద విమర్శలు చెయ్యడం మామూలైపోయింది. అయితే జగన్ చేస్తున్న విమర్శలు ఎంత వరకు వాస్తవాలు అన్న దాని కన్నా చాలా మంది జగన్ మాట్లాడే తీరు మీద దృష్టిసారిస్తున్నారు. జగన్ ఎంతసేపు మీడియా కవరేజ్ కోసమే మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి.. ఎలాగైనా పనులు చేయించే చిత్తశుద్ది మాత్రం కనిపించడం లేదని చాలా మంది అనుకుంటున్నారు. ఇక పార్టీలో నిజంగా పులిలాగానే ఉన్నా కానీ బయట మాత్రం ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో మాత్రం పేపర్ పులిలా మారారని.. ఎవరూ అదరడం.. బెదరడం లేదని జగన్ మీద చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : YS Jagan  Jagan  AP  AP Politics  JaganMohanReddy  YS JaganMohan Reddy  YSRCP  

Other Articles