AirAsia India Rolls Out Promotional Fares Starting Rs. 1269

Airasia india offers promotional fares sale

AirAsia India offers, AirAsia India promotional fares, AirAsia India domestic routes, AirAsia India overseas routes, Budget carrier AirAsia India, AirAsia India promotional fare scheme,

Budget carrier AirAsia India has yet again rolled out a promotional fare scheme, offering tickets as low as Rs 1,269 (all-inclusive). The offer ends on November 8, 2015 and is applicable on travel between January 15 and April 30, 2016.

ఎయిర్ ఏషియా చౌక ధర విమానయానం ఆఫర్

Posted: 11/05/2015 09:55 PM IST
Airasia india offers promotional fares sale

చౌకధర పోటీలోకి మరో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా కూడా వచ్చి చేరింది. ఇటీవల గో ఎయిర్ విమాన సంస్థ అత్యంత చౌక ధరలకు దేశీయంగా, విదేశీయంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన నేపథ్యంలో ఎయిర్ ఏసియా కూడా ప్రయాణ టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. దేశీయ విమానయానం ప్రారంభ ధర 1269 రూపాయలుగా ఎయిర్ ఏషియా తెలిపింది. ఆఫర్ల ధరల్లో టికెట్లను ఈనెల 8వ తేదీలోపు బుక్ చేసుకోవాలని పేర్కొంది. 2016 జనవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు దేశీయ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కాగా, అంతర్జాతీయ ప్రయాణాలు జనవరి 15 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు చేయాల్సి ఉంటుందని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది. బెంగళూరు నుంచి కొచ్చికి 1269 రూపాయలు కాగా, బెంగళూరు నుంచి గోవాకు 1469 రూపాయలుగా, బెంగళూరు నుంచి ఢిల్లీకి 3,469 రూపాయలుగా టికెట్ ధరలను నిర్ణయించింది. అలాగే ఎయిర్ ఏషియా అంతర్జాతీయ టికెట్ ధరలలో కూడా ఆఫర్లు ప్రకటించింది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి భారత్ లోని కొచ్చికి 3,399 రూపాయలుగా పేర్కొంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  AirAsia India discount offer  Promotional Fares  

Other Articles