Exit polls predict a close fight between Nitish-Lalu and Modi

Nitish lalu alliance ahead in bihar predicts exit poll

bihar assembly elections 2015, nitish kumar, lalu prasad yadav, pm modi, sushil modi, amit shah, post poll exit survey, bihar assembly polls, bihar assembly results, bihar elections results, sharad yadav, cow, NDA, congress, JDU-RJD, PM modi, narendra modi, amit shah,

Mahagatbandhan of chief minister Nitish Kumar and RJD chief Lalu Prasad is set to retain power in Bihar with a slender lead over the BJP-led NDA

మళ్లీ నితీష్ వైపుకే మొగ్గిన బిహారీలు.. ఎగ్జిట్ పోల్ అంచనాలు

Posted: 11/05/2015 09:07 PM IST
Nitish lalu alliance ahead in bihar predicts exit poll

బిహార్ ఓటర్లు మరోమారు తమ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నే కోరుకుంటున్నారా..? అందకనే మహాకూటమికే పట్టంగట్టనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఎన్నికల అనంతరం వెలువరించిన పోస్ట్ పోల్ సర్వేలు..ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే, వివిధ వార్తాసంస్థలు ఇచ్చిన అంచనాలలో వేర్వేరుగా ఫలితాలు వస్తున్నాయి. టైమ్స్ నౌ వర్గాలు జేడీయూ 112-132 స్థానాలతో మహాకూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేయగా, ఇండియాటుడే - సిసెరో సంస్థలు నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డీయేకు 120, మహాకూటమికి 117 స్థానాలు రావొచ్చని అంచనా వేశారు.

బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, మహాకూటమి తరఫున నితీష్ కుమార్, లాలుప్రసాద్ లాంటి నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. తొలుత మహాకూటమిలో సమాజ్ వాదీ పార్టీ కూడా ఉన్నా.. తర్వాత మాత్రం ములాయం సింగ్ యాదవ్ మాత్రం దాన్నుంచి తప్పుకొన్నారు. ప్రచార పర్వం హోరాహోరీగా జరిగింది. బిహార్ రాష్ట్రంలో ప్రధానంగా విద్యుత్, తాగునీరు, రోడ్లు, పేదరికం లాంటి సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వాటికి కారణం మీరంటే.. మీరంటూ ప్రధాన పక్షాలు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయమై వివిధ జాతీయ వార్తా చానళ్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. వాటి ప్రకారం అంచనాలు ఇలా ఉన్నాయి..

మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు: 243

వార్తా ఛానల్     ఎన్డీయే       మహాకూటమి   ఇతరులు
టైమ్స్ నౌ         111            122          10
ఎన్డీటీవీ           116            120           7
న్యూస్ ఎక్స్     90-100        130-140     13-23
ఇండియా టుడే  112-123      113-127     6
ఇండియా టీవీ   101-121      112-132     6-14
ఆజ్ తక్, ఏబీపీ  108           130     
న్యూస్ నేషన్     115-119     120-124     3-5
సీఎన్ఎక్స్         95            135           18
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar assembly elections 2015  nitish kumar  pm modi  post poll exit survey  

Other Articles