texas man stabbed to death by friend after taking last piece of chicken police say

Man killed roommate for eating last chicken piece

Texas man, stabbed, death, friend, last piece of chicken, policem crime, Reinaldo Cardoso Rivera, charged with murder, Darwin Perez Gonzalez, angry, argument, fist fight, knife, fatally stabbed,

Reinaldo Cardoso Rivera allegedly killed his friend Darwin Perez Gonzalez after he took the last piece of chicken at a dinner. (Photos: Cardoso Rivera, Houston Police Department; chicken,

ప్రాణాలు తీసిన పార్టీ.. చివరి చికెన్ ముక్కతో అతడికి నూరేళ్లు..

Posted: 11/05/2015 08:31 PM IST
Man killed roommate for eating last chicken piece

ఆ రోజు అతను అనుకోలేదు. తన మిత్రుడి ఇచ్చే పార్టీ చివరదని. అతనికి తెలియదు తాను ఆరగించిన చికెన్ ముక్క తన జీవితంలో ఆఖరిదని, సరదాగా స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంటున్నామన్న భ్రమలోనే వున్నాడు. కానీ ఆ యువకుడికి చివరకు తుదముట్టించింది కూడా ఆ చికెన్ ముక్కే. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.  పార్టీలో చికెన్ ముక్క కోసం చెలరేగిన స్వల్ప వివాదంతో స్నేహితుడిని  పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. హూస్టన్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం  రినాల్డ్ కార్డోసో రివేరా (38)  డార్విన్  పెరెజ్ గోంజాలెజ్ (34) ఇద్దరూ స్నేహితులు.  పెరేజ్ నివాసంలో మరో అయిదుగురు స్నేహితులు కలిసి  పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. చికెన్, మందుతో విందు జోరుగా నడుస్తోంది.

ఈ  క్రమంలో  డార్విన్  చికెన్ ఆఖరి ముక్కను ఆరగిస్తున్నాడు. అయితే ఆ ముక్క తనకు కావాలంటూ రివేరా అనటంతో ....  ఇద్దరి మధ్యా  మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.   అసలే మద్యం సేవించి ఉన్నారేమో, విచక్షణ మరిచిపోయారు.  ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న క్రమంలో రివేరా, డార్విన్  పై కత్తి దూశాడు. ఆగ్రహం పట్టలేని రివేరా...స్నేహితుడిని పలుమార్లు కత్తితో పొడిచి  అతి దారుణంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినా , ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Texas man  stabbed  death  friend  last piece of chicken  crime  

Other Articles