wells and fargo employee sharmila has revealed company secrets to boyfriend spivak to make him billionaire | love affairs | love controversies

Girlfriend sharmila reveals company secrets to boyfriend spivak to make him billionaire

employee fraud to company, dodda sharmila fraud to company, wells and fargo company, sharmila cheated company for boyfriend, girlfriend make boyfried billionaire

girlfriend sharmila reveals company secrets to boyfriend spivak to make him billionaire : wells and fargo employee sharmila has revealed company secrets to boyfriend spivak to make him billionaire.

ప్రియుడిని కోటీశ్వరుడిగా మార్చాలని..

Posted: 11/04/2015 10:32 AM IST
Girlfriend sharmila reveals company secrets to boyfriend spivak to make him billionaire

వారిద్దరు అమర ప్రేమికులు.. ఒకరిని వదిలి మరొకరు వుండలేరు.. ఒకరికోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధంగా వుంటారు.. ఎంతకు తెగించేందుకైనా సై అంటారు.. అలా పీకల్లోతు ప్రేమలో విహరిస్తున్న ఈ ప్రేమపావురాలు డబ్బుకోసం అడ్డదారులు తొక్కింది. నిరుద్యోగిగా వున్న తన ప్రియుడిని కోటీశ్వరుడిగా మార్చాలని భావించిన ప్రేయసి.. అందుకోసం తాను పనిచేస్తున్న కంపెనీని మోసం చేసింది. ఎలాగోలా తన బాయ్ ఫ్రెండ్ ని కోటీశ్వరుడ్ని చేసిందిగానీ.. చివరికి వ్యవహారం బయటపడటంతో ఆమె కేసులను ఎదుర్కొంటోంది.

మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. దొడ్డి షిర్మిల అనే యువతి యూఎస్ లోని ‘వేల్స్ అండ్ ఫార్గో’ అనే సంస్థలో అనలిస్టుగా పని చేస్తోంది. డెంటల్ సంస్థ 'అమెరికన్ డెంటల్ పార్ట్ నర్స్'తో 398 మిలియన్ డాలర్ల విలువైన డీల్ ను కుదుర్చుకునే దిశగా ‘వేల్స్ అండ్ ఫార్గో’ అడుగులు వేస్తోంది. అయితే.. ఈ విషయం ఆ కంపెనీలో పనిచేస్తున్న కేవలం కొద్దిమంది ఉద్యోగులకు తప్ప మరెవ్వరికి తెలియదు. ఆ ఉద్యోగుల్లో షర్మిల కూడా వుంది. ఇదే అదునుగా భావించిన ఆమె తన ప్రియుడ్ని కోటీశ్వరుడిగా మార్చే అవకాశం లభించిందని భావంచింది. తమ కంపెనీ కుదుర్చుకున్న డీల్ విషయం షిర్మిల తన బాయ్ ఫ్రెండ్ వ్లాడ్ స్పివాక్ కు చెప్పింది. దీంతో అతను డెంటల్ సంస్థ వాటాలను కొనుగోలు చేశాడు. ఆపై ఇరు కంపెనీల మధ్యా డీల్ ప్రకటితం కాగా, ఆ సంస్థ ఈక్విటీ అమాంతం పెరిగింది. దీంతో స్పివాక్ కు 2.22 లక్షల డాలర్లు (సుమారు రూ. 14.4 కోట్లు) లాభం వచ్చింది. మొత్తానికి ప్రియురాలు షర్మిల చేసిన ఈ సాహసానికి ఆమె బాయ్ ఫ్రెండ్ స్పివాక్ కోటీశ్వరుడిగా మార్చేసింది.

అయితే.. తాము కుదుర్చుకుందామన్న డీల్ చేజారిపోవడంతో కాస్త నిరాశకు గురైన ‘వేల్స్ అండ్ ఫార్గో’ కంపెనీ అందుకుగల కారణాలేంటో తెలుసుకునేందుకు రహస్య విచారణ జరిపింది. అందులో భాగంగానే వారికి షర్మిల కారణంగా తమకు డీల్ పోయిందన్న విషయాన్ని గమనించిన ఆ కంపెనీ.. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు ఫిర్యాదు చేయగా.. షిర్మిలపై కేసు నమోదు చేసింది. ఆమె కావాలనే సంస్థ వివరాలు బయటకు వెల్లడించిందని, ఆమెను తొలగించామని వేల్స్ ఫార్గో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, ఆమె స్వయంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ లో పాల్గొనలేదు కాబట్టి భారీ జరిమానాతో సరిపెట్టవచ్చని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles