before death sarika wrote a letter to aicc to not give mp ticket to her father in law siricilla rajaiah | sarika died with three children

Sarika wrote letter to aicc to not give mp ticket to her father in law siricilla rajaiah

sarika died, rajaiah daughter in law died, sarika died with three children, rajaiah mp seat controvers, rajaiah updates, rajaiah daughter in law controversies, congress party news, sarika with her three children

sarika wrote letter to aicc to not give mp ticket to her father in law siricilla rajaiah : before death sarika wrote a letter to aicc to not give mp ticket to her father in law siricilla rajaiah.

ట్విస్ట్ : మామకు టికెట్ ఇవ్వొద్దంటూ ఏఐసీసీకి సారిక లెటర్

Posted: 11/04/2015 11:00 AM IST
Sarika wrote letter to aicc to not give mp ticket to her father in law siricilla rajaiah

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఈరోజు ఉదయం జరిగిన అగ్నిప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా.. తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పిల్లలతో సహా తనను పట్టించుకోని మామ రాజయ్యకు వరంగల్ లోక్ సభ టికెట్ ఇవ్వొద్దంటూ సారిక ఏఐసీసీకి మూడురోజుల క్రితమే లేఖ రాసిందట. ఆ లేఖలో తన మామకు వ్యతిరేకంగా కొన్ని అభిప్రాయాలను సైతం వెల్లడించిందని తెలుస్తోంది.

అయితే.. సారిక రాసిన ఆ లేఖ ఏఐసీసీ పెద్దలకు చేరిందో లేదో.. ఒకవేళ చేరినా దానిని పట్టించుకోకుండా పక్కనపెట్టేశారమో పక్కాగా తెలియదు కానీ.. రాజయ్యకే టికెట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే రెండురోజుల క్రితమే వరంగల్ లోని తన ఇంటికి మకాం మార్చిన రాజయ్య.. ఆ సందర్భంగా తన కోడలు సారికతో గొడవ పడ్డారట. బహుశా ఆమె రాసిన లెటర్ విషయమై ఆయన గొడవ పడ్డారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు వ్యతిరేకంగా ఆ లెటర్ రాసినందుకు ఆగ్రహించిన ఆయన.. ఇంటికొచ్చిన వెంటనే తన కోడలు సారికతో గొడవకు దిగారట.

గతంలోనూ చాలాసార్లు ఆయన సారికతో గొడవ పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఈమె తనను, తన పిల్లలను భర్త, అత్తమామలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సారిక కొన్ని నెలల క్రితం సెక్షన్ 498 కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆ వివాదం అప్పట్లో కాస్త సద్దుమణిగింది కానీ.. అనంతరం మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయట. ఇలాంటి సమయంలోనే ఇంట్లో ప్రమాదం చేసుకోవడం, ముగ్గురు పిల్లలతో సహా సారిక మంటలకు ఆహుతి కావడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరెన్ని ట్విస్టులు వెలుగు చూస్తాయో!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajaiah daughter in law sarika died  sarika letter to aicc  

Other Articles