pakistani woman | set ablaze | love refuse | marriage proposal | dies | psycho | Sonia Bibi | former lover

Woman set alight for refusing marriage proposal dies

Pakistan, Marriage proposal, Woman set alight, Crimes against women, Hospital, Pakistani woman, set alight, refusing marriage, set ablaze, love refuse, psycho, Sonia Bibi, former lover, Multan district, central Punjab province, Ahmed, domestic violence, defending family honour

Pakistani burn victim Sonia Bibi, 20, resting on a hospital bed at a hospital in Multan. She was burned over nearly half her body after she refused to marry her former lover.

మరో ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి అంగీకరించలేదని..

Posted: 11/04/2015 09:20 AM IST
Woman set alight for refusing marriage proposal dies

మరో ప్రెమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతో పెళ్లికి అంగీకరించిలేదని తన మాజీ ప్రియురాలిపై అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మాజీ ప్రియుడి చేతిలో తీవ్రంగా గాయపడిన ఆమె దాదాపు నెల రోజుల పాటు జీవన్మరణాల మధ్య ఊగిసలాడిన అమెను చివరకు విధి వంచించింది. నెల రోజులుగా ముల్లాన్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి క్రితం రోజు సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఓ మారుమూల గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తనతో పెళ్లికి నిరాకరించినందుకు సోనియా బీబీ(20)పై మాజీ ప్రియుడు లతీఫ్ అహ్మద్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో సోనియాబీబీ శరీరంలో 45 నుంచి 50 శాతం కాలిపోయింది. ఈ దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లతీఫ్ అహ్మద్(24) ని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఛాందసవాదులు, పితృస్వామిక సమాజానికి వ్యతిరేకంగా మహిళల అభ్యున్నతి కోసం పోరాడే ఔరత్ ఫౌండేషన్ ఈ దాడిని ఖండించింది. 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో దాదాపు 3000 మంది మహిళలు వివిధ రకాల దాడుల్లో హత్యకు గురయ్యారని ఔరత్ ఫౌండేషన్ వెల్లడించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistani woman  set alight  refusing marriage  

Other Articles