British woman writes SOS messages in ketchup after getting trapped in Subway sandwich freezer for eight hours

Ketchup sign saved subway worker locked in freezer

woman, trapped, subway, sandwich, freezer, temperature, britain, england, stuck, help, mayonnaise, ketchup, British woman, SOS messages, trapped in sandwich freezer, Karlee Daubeney, Subway restaurant, Karlee Daubeney in freezer for eight hours

Karlee Daubeney was trapped in a freezer at a Subway restaurant for eight hours and wrote SOS messages in ketchup.

ఆర్థానాధాలు వినబడలేదు.. సందేశమే కాపాడింది.

Posted: 11/03/2015 05:26 PM IST
Ketchup sign saved subway worker locked in freezer

మనం సాధారణ చలికే తట్టుకోలేక వణికిపోతాం. స్వెట్లర్లు, దుప్పట్లు కప్పుకుని మన శరీరాల్ని రక్షించుకుంటాం. అలాంటిది ఓ యువతి దాదాపు సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత మాత్రమే ఉన్న ఫ్రిజ్‌లో ఇరుక్కుని 8 గంటలపాటు నరకయాతన అనుభవించింది. అదీ కాకుండా ఆ సమయంలో ఆ యువతి టాప్‌, పలుచని లెగ్గిన్స్‌ మాత్రమే వేసుకుని ఉంది. తనను రక్షించాలని అ యువతి చేసిన ఆర్థానాథాలు ఎవరికీ వినబడలేదు. అయితే అపత్కాలంలో వున్న అమెకు వచ్చిన ఓ ఐడియా మాత్రం అమెను కొన్ని గంటల తరువాత గుర్తించేట్లు చేసింది. అదే అమె రాసిన సందేశం.

వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని సబ్‌వే ఫ్రాంచైజీలో కార్లీ దౌబినే (20) అనే యువతి స్టోర్‌ కీపర్‌గా పని చేస్తోంది. రోజు మాదిరిగానే యథావిధిగా లేట్‌నైట్‌ షిఫ్ట్‌కు వచ్చి విధులు నిర్వహించింది. షాప్‌ మూసే సమయంలో ఆ రోజు మిగిలిపోయిన పాలను సాండ్ విచ్ ఫ్రీజర్‌లో పెట్టేందుకు లోపలికి వెళ్లింది. కార్లీ దౌబినే వెళ్లిన విషయాన్ని గమనించని సెక్యూరిటీ గార్డు ఫ్రీజర్‌ తలుపు మూసేశాడు. కార్లీ ఎంత అరిచినా ఎవరికీ వినిపించలేదు. కెచప్‌తో ఫ్రీజర్‌ గ్లాస్‌ డోర్లపై ‘హెల్ప్‌మీ’ అని పలుసార్లు రాసినా.. లాభం లేకపోయింది.

కార్లీ సందేశం చూసిన మరుసటి రోజు కార్మికులు ఆమెను అదుకునేందుకు అపన్నహస్తం అందించేలా చేసింది. తర్వాతి రోజు ఉదయం వరకు అలాగే ప్రీజర్ లో ఉండిపోయిన కార్లీని అమె సహచరులు బయటకు తీసుకువచ్చారు. ‘అన్ని గంటలపాటు ఫ్రీజర్‌లో ఉండిపోవడం వల్ల నా కండరాలు పట్టేశాయి. నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను హైపోథెర్మియాకు దగ్గర్లో ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఇంత జరిగినా నాకు ఎలా ఉంది అని అడగకుండా.. ఎప్పుడు పనిలోకి వస్తావని మేనేజర్‌ అడగడం నాకు చాలా బాధగా ఉంద’ని చెప్పింది. అంతేకాకుండా సబ్‌వే సంస్థపై కోర్టులో కేస్‌ కూడా వేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karlee Daubeney  SOS messages  sandwich freezer  Subway restaurant  

Other Articles