Kamal Haasan slams Award Wapsi movement, says it's a futile exercise

Won t return my national award kamal haasan

kamal haasan, south indian film icon, award wapsi movement, writers, film makers, kamal slams award wapsi movement, kamal haasan futile exercise, kamal refused to return national award, religious intolerance, kamal kollywood icon, good gesture, protest against government, national awards, cheekatirajyam, Trisha

South Indian actor Kamal Haasan has finally spoken out on the rising religious intolerance in the country and said that he would not return his national award.

అవార్డు వాపసీ అందోళనపై కమల్ సంచలన వ్యాఖ్యలు..

Posted: 11/03/2015 04:25 PM IST
Won t return my national award kamal haasan

పలువురు సినీప్రముఖులు, రచయితలు జాతీయ అవార్డులను వెనక్కు తిరిగి ఇవ్వడాన్ని ప్రముఖ నటుడు కమలహాసన్ తప్పుబట్టారు. అవార్డులను వెనక్కి ఇవ్వడం ప్రభుత్వంతో పాటు ప్రజలను కూడా అవమానపర్చడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన అవార్డను వెనక్కిచ్చే అందోళనను, ఆందోళనకారులపై మండిపడ్డారు. తనకు వచ్చిన జాతీయ అవార్డును తాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తిరిగి ఇవ్వనని ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వంపై వున్న వ్యతిరేకతను అందోళనకారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వ్యక్తపర్చాలని కోరారు.

తన తాజా చిత్రం చీకటి రాజ్యం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రచయితలు, కళాకారులు అవార్డులను వెనక్కి ఇవ్వడంపై స్పందించారు. కళాకారులు, రచయితలు అవార్డులను వెనక్కి ఇవ్వకుండా.. ప్రభుత్వంపై వున్న అసహనన్ని వ్యక్తపర్చేందుకు మరో మార్గాన్ని కనుగొనాలని అన్నారు. మత సహనం కంటే మత అసహనంపై చర్చ జరిగితే బాగుంటుందని ఆయన సూచించారు. గతంలోనూ తీవ్రస్థాయిలో పెల్లుబిక్కిన మత అసహనం దేశాన్ని రెండు బాగాలుగా చేసిందన్న విషయాన్ని ఆయన ఊటంకించారు. అసహనమే లేకుంటే భారత్-పాకిస్థాన్ ఒకే దేశంగా ఉండేవని అభిప్రాయపడ్డారు. సహనం అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అని కమల్ అభిప్రాయపడ్డారు. మనలో సహనం పెంపోందించుకో గలిగితే.. మనం అన్ని రంగాల్లో చైనాను మించిపోయి ఉండేవారని కమల్ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Hassan  national awards  cheekatirajyam  Trisha  

Other Articles