Salman Khan reacts on intolerance against Pakistani artists

Salman khan on ban on pakistani actors don t mix politics and art

Salman Khan, Bollywood star, Intolerance debate, pakistani actors ban,salman khan films,mahira khan,fawad khan, Growing intolerance, prohibiting Pakistani artists, art and entertainment, salman khan artists have no boundaries, India, Narendra Modi

Reacting to the recent debate over prohibiting Pakistani artists from working in our country, Bollywood star Salman Khan has said that art and entertainment have no boundaries, adding that they shouldn’t be mixed with politics.

పాకిస్తాన్ అర్టిస్టులపై సల్మాన్ ఖాన్ స్పందన.. ఆ రెండింటినీ కలపోద్దని వినతి

Posted: 11/03/2015 04:12 PM IST
Salman khan on ban on pakistani actors don t mix politics and art

కాళాకారులకు ఎల్లలు లేవని, హద్దులు వుండటం కూడా మంచిది కాదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్నారు. పాకిస్థాన్ కళాకారులకు మద్దతుగా ఆయన ముందుకొచ్చారు. పాకిస్థాన్ నటులు, కళాకారులను భారత్ లో అడ్డుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. బాలీవుడ్ చిత్రాల్లో నటించకుండా అక్కడి నటులను అడ్డుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఒక పాత్రకు పాక్ కళాకారుడు సరిగ్గా సరిపోతాడని భావిస్తే.. అతనిని బాలీవుడ్ సినిమాల్లో తీసుకోవచ్చునన్నారు. బాలీవుడ్ సినిమాలు పాకిస్థాన్ లో భారీ వసూళ్లు సాధిస్తున్న విషయాన్ని మరిచిపోకూడదని పేర్కొన్నారు.

'ప్రస్తుతం ప్రతిదీ డిజిటల్ గా మారిపోయిందని.. డిజిటలైజేషన్ ద్వారా యావత్ ప్రపంచంలోని కళాకారులు వారి పరిధిని కూడా విస్తరించుకున్నారన్నారు. భారతీయులు వినోద కార్యక్రమాలన్నింటినీ ఆస్వాదిస్తున్నారు. ప్రజాదరణ పొందిన పాకిస్థాన్ షోలను కూడా చూస్తున్నారు. కళ, వినోద రంగాలకు ఎల్లలు లేవని, వాటిని రాజకీయాలతో ముడిపెట్ట కూడదని విన్నవించిన ఆయన ఆ రెండింటినీ కలపి చూడకూడదన్నారు. పాక్ కళాకారులపై భారత్ లో ఆంక్షలు విధించడంపై జరుగుతున్న చర్చపై ఆయన మంగళవారం ఈమేరకు స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళ, వినోదానికి  సరిహద్దులు ఉండవు. అవి కేవలం సామాన్య ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతాయి' అని ఆయన పేర్కొన్నారు. ముంబైలో సంగీత కార్యక్రమం నిర్వహించకుండా పాకిస్థాన్ గజల్ గాయకుడు గులాం అలీని శివసేన అడ్డుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న పాక్ నటులు ఫవద్ ఖాన్, మహిరా ఖాన్ లను కూడా శివసేన బెదిరించింది. 'సరిహద్దుల్లో పాక్ కాల్పుల్లో మన జవాన్లు చనిపోతుంటే.. ఆ దేశపు కళాకారులను ఎలా అనుమతిస్తాం?' అని శివసేన తన చర్యను సమర్థించుకుంది. కళాకారులకు రెవెన్యూ, ప్రజాదరణ ఎంత ముఖ్యమో.. అంతకన్నా ఒక దేశస్థుడిగా.. ధేశం, సైన్యం, రక్షణ, శాంతి భద్రతలు కూడా అంతే ముఖ్యమని శివసేన నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Intolerance debate  Pakistani artists  India  Narendra Modi  

Other Articles