BJP-backed candidates win only 8 of 48 seats in PM Modi's Varanasi constituency

Bjp backed candidates win only 8 of 48 seats in varanasi

Samajwadi Party (SP), Bharatiya Janata Party (BJP), Congress, Narendra Modi, Varanasi, Bahujan Samaj Party (BSP), Zilla Parishad elections, Zilla Panchayat president, Sujit Singh, Sewapuri seat, Arun Singh, Ramesh Tiwari alias Guddu Tiwari, Satish Fauji,

Prime Minister Narendra Modi's Lok Sabha constituency Varanasi on Monday saw BJP supporters winning in only eight of the total 48 seats in the Zilla Parishad elections in which those supported by SP got 25 seats.

ప్రధాని ఇలాకాలో ప్రత్యర్థి పార్టీలకు అదరణ.. బీజేపీకి ఎదురుగాలి..!

Posted: 11/02/2015 10:05 PM IST
Bjp backed candidates win only 8 of 48 seats in varanasi

ప్రధాని నరేంద్ర మోదీ నామ జపంతో పులకించి.. ఆయనకు బ్రహ్మాండమైన మోజారిటీని సాధించి పెట్టిన వారణాశి ప్రజలు.. ఇప్పడు ఆయన తీరును పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీకి జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. వారణాశి పరిధిలో 48 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ మద్దతుదారులు కేవలం 8 సీట్లను గెలుచుకున్నారు. యూపీలో అధికార సమజ్వాదీ పార్టీ బలపరిచిన 25 మంది విజయం సాధించారు. బీఎస్పీ 3, అప్నాదళ్ 4, కాంగ్రెస్ 2 స్థానాల్లో నెగ్గాయి.  

మోదీ దత్తత తీసుకున్న జయపూర్ గ్రామంలో కూడా బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ బీజేపీ మద్దతుదారు బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. కాగా సెక్టార్ 1, 7లలో బీజేపీకి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ మద్దతు ఇచ్చిన జిల్లా పంచాయత్ ప్రెసిడెంట్ సుజీత్ సింగ్ విజయం సాధంచారు. అయితే ఏడాదిన్నర లోనే ఇంతటి వ్యతిరేకత ఊహించని బిజేపి నేతలు ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.  ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్దితో వ్యవహరించాలని పార్టీ వర్గాలు స్థానిక నేతలను అదేశించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Varanasi  Narendra Modi  Zilla Parishad elections  

Other Articles