Miracle girl born with heart OUTSIDE her chest defies odds after travelling to US for specialist treatment

Little girl living with heart outside her chest

Little girl living with heart outside her chest, Meet,girl,heart,outside,chest,Six,year,old,beating,odds,born,rare,lie,threatening,birth,defect,Medical miracles, Hospitals, Love, Blood pressure, Dolphins, heart and other organs outside her chest, borun flowntoUS for medical care, borun raising funds for surgery

This six-year-old girl was born with her heart and other organs outside her chest cavity and has flown from Russia to the US for medical care

ITEMVIDEOS: చిన్నారి చిట్టి గుండె తెచ్చిన కష్టం.. ఆ హృదయ స్పందనలు చూడండీ..

Posted: 11/02/2015 09:45 PM IST
Little girl living with heart outside her chest

ఆ చిట్టితల్లి మిగతా పిల్లలాగానే నాట్యం చేస్తుంది, ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటుంది. అయితే అందరిలా తల్లి ఒడిలో కూర్చుని అల్లరి చేయాల్సిన వయసులో.. తన తల్లితోనే కలిసి మనుగడ కోసం పోరాటం సాగిస్తోంది. గుండె చేత పట్టుకుని అమెరికాకు పయనమైన ఈ చిన్నారి.. ఎందుకో తెలుసా..? పది లక్షల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి బారిన పడి ఈ చిన్నారి బాధపడుతోంది. ఆ చిన్నారి రష్యాకు చెందిన విర్సావియా. మానవ మనుగడలో కీలక భూమిక పోషించే గుండె. అందరికి మాదిరిగా చాతి లోపల భాగాన వుండటానికి బదులు.. ఆ చిన్నారికి శరీరం వెలుపల ఛాతీ మధ్యలో ఉంది. కేవలం చిన్న చర్మపు పొర సహాయంతో ఉన్న ఆ హృదయం స్పందనలు కూడా బయటకు కనబడుతున్నాయి. అత్యంత అరుదుగా కనిపించే ఈ వ్యాధి పేరు ‘థొరాకో అబ్‌డోమినల్‌ సిండ్రోమ్‌’.

దీన్ని శస్త్ర చికిత్స ద్వారా సరిచేయడం చాలా కష్టం. ఇప్పటికే ఎంతోమంది వైద్యులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు కూడా. అయినా ఆ చిన్నారి తల్లి డారీ బోరెన్‌ మాత్రం ఆశ కోల్పోలేదు. ఇటీవలె బోస్టన్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు ఈ చిన్నారికి శస్త్రచికిత్స చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే ఆ పాప రక్తపోటు చాలా ఎక్కువగా ఉండడం వల్ల వారు వెనకడుగు వేశారు. దీంతో మందుల ద్వారా రక్తపోటు తగ్గించేందుకు విర్సావియా, బోరెన్‌ అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌కు పయనమవుతున్నారు. కాగా సర్జరీకి కావాల్సిన డబ్బులను సమీకరించుకునేందుకు బొరన్ తల్లి విరాళాలను కూడా సేకరిస్తుంది. శరీరం బయట గుండెతో పుట్టించి అన్యాయం చేసిన ఆ దేవుడు.. ఆ పాపకు గుండె ధైర్యం మాత్రం చాలా ఎక్కువగానే ఇచ్చాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారి విజయవంతంగా శస్త్రచికిత్స ముగించుకుని క్షేమంగా తిరిగిరావాలని ఆశిద్దాం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virsaviya Borun  Russia  Pentalogy of Cantrell  America  

Other Articles