Modi feel sad on that statements

Modi feel sad on that statements

Modi, Bihar, Elections, Nitesh Kumar, Lalu Prasad, Bihar Polls

With the third phase of the Bihar polls now behind us, it is anybody’s guess what surprise the ballot-box will spring on us come 8 November. This electoral test, billed by the media as Narendra Modi’s biggest challenge, is actually a life-and-political-death issue for Nitish Kumar, not Modi. If Nitish loses, his credibility is shot to pieces. If he wins, he soars on the national political landscape, and will be billed as a “secular”alternative to Modi and even the Congress.

అందుకు మోదీకి బాధేస్తోందట

Posted: 10/30/2015 12:32 PM IST
Modi feel sad on that statements

ప్రధాని నరేంద్ర మోదీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికల్లో వాడీవేడిగా సాగుతున్న విమర్శల పర్వం మీద తన మనసులోని మాటను విప్పారు. బీహార్ యువత తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని.. అందుకు ఓటును ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ల మీద తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న మోదీ... ఓటర్లను ఒక్క సారి ఇలోచించమని అంటున్నారు. అయితే ఎన్నికల్లో బాగంగా నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు చేస్తున్న విమర్శలు చూస్తే తనకు బాధేస్తోందని అంటున్నారు మోదీ. ఇంత దిగజారుడు విమర్శలా అని అంటున్నారు. మూడు దశల ఎన్నికలు ముగిసిన బీహార్ లో మరో రెండు విడతల ఎన్నికలు మిగిలి ఉన్నాయి.

నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు తన మీద చేస్తున్న ఆరోపణలు... రాజకీయల్లో దిగజారిన విలువలను గుర్తు చేస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. కానీ కొందరు మాత్రం తమ విలువలను వదిలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. నితీష్ కుమార్ కు తన మంత్రి వర్గంలోని మంత్రి, ఓ ఎమ్మెల్యే లక్షలకు లక్షల రూపాయలను లంచంగా తీసుకున్నా కనిపించదు కానీ.. తన మీద , తన అవినీతిరహిత కేబినెట్ మీద మాత్రం విమర్శలు గుప్పిస్తారని అన్నారు. అయినా నితీష్ తనను విమర్శించేంత స్థాయి కాదు అని అన్నారు. తమ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీహార్ లో వలసలు ఉండవని.. యువత కొసం ఉద్యోగాలు సృష్టిస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Bihar  Elections  Nitesh Kumar  Lalu Prasad  Bihar Polls  

Other Articles