a husband named kiritee sent his wife lakshmi durga out of the house for not doing job in adilabad | husband torture wife

Husband sent his wife out of the house for not doing job

husband torture wife, husband beating wife, husband beat wife for not doing job, husband forced wife to do job, husband forced wife to earn money, dowry cases, in-laws torture woman

husband sent his wife out of the house for not doing job : a husband named kiritee sent his wife lakshmi durga out of the house for not doing job in adilabad.

ఉద్యోగం చేయట్లేదని భార్యను గెంటేసిన భర్త!

Posted: 10/30/2015 11:27 AM IST
Husband sent his wife out of the house for not doing job

అవును.. మీరు చదువుతోంది నిజమే! భార్య ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడం లేదని ఓ పనికిమాలిన భర్త ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. ఉద్యోగం చేసి తనను పోషిస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలంటూ తన భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు.. ఇప్పటికే ఎన్నో కష్టాలతో సతమతమవుతున్న తన కుటుంబసభ్యులకు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం జరిగేంతవరకు ఆ ఇంటిముందే కూర్చుని వుంటానంటూ ఆమె బైఠాయించింది. ఈ ఘటన ఆదిలాబాద్ లో జరిగింది.

విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లికి చెందిన లక్ష్మీదుర్గకు 2010 ఆగస్టు 14వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని రాంనగర్ కాలనీకి చెందిన బాయి లక్ష్మణ్‌రావు కుమారుడు కిరిటీతో వివాహం జరిగింది. పెళ్లైన తొలినాళ్లలో వీరి దాంపత్యం జీవితం సంతోషంగానే కొనసాగింది కానీ.. ఆ తర్వాత భర్తలో దాగివున్న రాక్షసత్వం బయటపడింది. కొంతకాలం తర్వాత భర్తతోపాటు, అత్తామామలు, బావ, తోటికోడళ్లు అందరూ కలిసి లక్ష్మిని ఉద్యోగం చేయాలంటూ వేధింపులకు గురిచేసేవారు. తమ కొడుకు ఉద్యోగం చేసి పోషించలేడని, నువ్వే పోషించాలంటూ అత్తామామలు తనపై దాడులు చేసేవారని లక్ష్మి వాపోయింది. పెద్ద కోడలు ఎక్కువ డబ్బు తెచ్చింది.. నువ్వే తక్కువ తెచ్చావంటూ తనను వేధించేవారని చెప్పింది. 2012లో బాబుకు జన్మనిచ్చిన తర్వాత రెండు నెలలపాటు చూసేందుకు కూడా భర్తగానీ, అత్తారింటి నుంచి మరెవ్వరూ కానీ రాలేదని ఆమె తెలిపింది. తానే ఐదు నెలల తర్వాత బాబును తీసుకొని తిరిగి ఆదిలాబాద్‌కు వచ్చానని, అప్పటి నుంచి తనను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టేవారని పేర్కొంది. చుట్టుపక్కల వారు సహాయం చేస్తే వారిని కూడా బెదిరించి తనను ఇంట్లోంచి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

అత్తారింటివారి వేధింపులు భరించలేక తమ గ్రామంలో పోలీసు కేసుపెట్టడంతో... అక్కడి పోలీసు కౌన్సెలింగ్ ఇవ్వగా తన భర్త కిరిటీ తనను బాగా చూసుకుంటానని చెప్పడంతో తిరిగి ఆదిలాబాద్‌కు వచ్చానని తెలిపింది. కానీ.. వారు వేధింపులు చేయడం ఆపలేదట. దీంతో తాను మళ్లీ ఇంటికి వెళ్లిపోయానని లక్ష్మి తెలిపింది. అయితే.. ఎన్ని రోజులు భర్తను విడిచి తల్లిగారి ఇంట్లో వుండాలని నిర్ణయించుకుని ఆమె.. తిరిగి అత్తారింటికి వస్తే తనను ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగం చేసి ఇంట్లోవాళ్లను పోషిస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలంటూ భర్త కూడా కండీషన్ పెట్టాడని ఆమె తెలిపింది. ఉద్యోగం చేయడమే కాకుండా.. మరిన్ని డబ్బులు తీసుకురావాలంటూ తనను కొట్టేవారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రూ. 5 లక్షలతోపాటు అన్ని లాంఛనాలు ఇచ్చినప్పటికీ మరిన్ని డబ్బులు తేవాలని ఒత్తిడి చేశారని వివరించింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని భర్త ఇంటిఎదుటే బైఠాయించిన ఆమె, ఆ తర్వాత మహిళా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband torture wife  husband forced wife to do job  

Other Articles