No Power to Nitish Building for Years

No power connection for cm s residence

nitish kumar, no power to nitish building, power supply in Bihar, rjd, jdu, bihar elections, bhigah village, nitish kumar guest house, No Power to Nitish Building for Years, No power connection for CM's residence, Bihar CM 'powerless'

‘Bhigah’ is a small village in Nalanda district of Bihar state, where almost every household has power supply except a ‘building’, which is owned by Bihar’s former chief minister Nitish Kumar.

రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ విద్యుత్ కనెక్షన్ వుంటేనే.. ఆ ఇంట్లోనూ..

Posted: 10/25/2015 08:38 PM IST
No power connection for cm s residence

బీహార్లోని నలంద జిల్లాలో గల కళ్యాణ్ బిగా అనే గ్రామంలో 24గంటలు నిరంతర విద్యుత్ పరఫరా కోనసాగుతుంది. అయితే ఒక్క ఇంటికి మాత్రం అసలు విద్యుత్ కనెక్షన్ లేదు. అదేదో పేదవాడి ఇళ్లనుకుంటే పొరపాటే. ఆ ఇంట్లో విద్యుత్ సరఫరా తీసుకోవాలంటే.. క్షణాల్లో బిగించే అవకాశాలు వున్నాయి. అయినా ఆ ఇంట్లోకి మాత్రం విద్యుత్ కనెక్షన్ తీసుకోలేదు. ఇప్పడు బిగా గ్రామంలో నిరంతరం విద్యుత్ సరఫరా వున్నట్లే.. రాష్ట్రం మొత్తం నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగినప్పుడే ఆ ఇంట్లోకి విద్యుత్ కనెక్షన్ వస్తుంది. ఇలాంటి నిర్ణయం తీసుకుందెవరో తెలుసా..?

స్వయంగా బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఎందకంటే ఆ ఇళ్లు. ఆయనదే. ఆ ఇల్లు నిర్మించి చాలా ఏళ్లు అయినా ఇప్పటి వరకు ఆ ఇంట్లో విద్యుత్ వెలుగులు మాత్రం లేవు. ఈ విషయంపై ఆరా తీయగా.. ఆ ఇంటిని కాపలాగా ఉండి సంరక్షించుకునే సీతారం అనే పెద్ద మనిషి వివరణ ఇచ్చాడు. 'ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కట్టుకున్న ఈ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. బీహార్లోని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ వచ్చే వరకు తన ఇంటికి కనెక్షన్ తీసుకోనని నితీశ్ కుమార్ చెప్పారు' అని అతను చెప్పాడు.

దీంతోపాటు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ నితీశ్పై అభిమానం కలిగి ఉన్నారని, మూడోసారి కూడా నితీశ్ ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్జేడీతో కలిసి ఈసారి జేడీయూ ఎన్నికల బరిలోకి దిగడం ప్రశ్నించగా.. నితీశ్ ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ మంచి అభివృద్ధి చేస్తాడని చెప్పాడు. ప్రారంభంలో బీహార్లో నేర ప్రవృత్తి ఎక్కువగా ఉండేదని, కానీ తుపాకీ సాయం లేకుండానే ఆయన దానిని నిర్మూలించాడని చెప్పారు. మున్ముందు కూడా ఇలాగే బీహార్ ఆయన ఆధ్వర్యంలోనే ఆర్థిక పురోగతి సాధిస్తుందని తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar  cm nitish kumar  power  seetharam  

Other Articles