Pakistani PM Nawaz Sharif heckled during speech at US think-tank

Pm nawaz heckled at us think tank

Balochistan, Barack Obama, Nawaz Sharif, Osama bin Laden, Pakistan, US, US Institute of Peace, washington, pakistani, prime minister nawaz sharif, heckled, protester, demanded, restive, balochistan, province, activists, army, engaged, abductions, torture, killings, , sharif, delivering, address, at, us, institute, peace, prominent

Washington: Pakistani Prime Minister Nawaz Sharif was today heckled by a protester who demanded to free the restive Balochistan province where activists say army is engaged in abductions, torture and killings.

పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు అగ్రరాజ్యంలో పరాభవం

Posted: 10/24/2015 09:24 PM IST
Pm nawaz heckled at us think tank

అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అంతర్జాతీయ స్థాయిలో అవమానం జరిగింది. అంతేకాదు కాశ్మీర్‌ పేరుతో భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఇరుకున పెట్టాలనుకున్న పాక్ అమెరికాలో అడ్డంగా దొరికిపోయింది. వాషింగ్టన్‌లోని యూఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో ప్రధాని షరీఫ్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి పైకి లేచాడు. కాశ్మీర్ సంగతి పక్కన పెట్టండి. ముందు బెలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం ఇవ్వండి అంటూ నినాదాలు చేశాడు. అంతటితో ఆగలేదు లాడెన్‌కు స్నేహితుడని నిందించాడు.

చైనాతో కలిసి బెలూచిస్తాన్‌లో జరుపుతున్న మానవహక్కుల ఉల్లంఘనను ఆపాలని డిమాండ్ చేశాడు. ప్లకార్డు ప్రదర్శించాడు. ఊహించని ఈ పరిణామంతో నవాజ్ షరీఫ్ బిత్తరపోయారు. తేరుకోలేకపోయారు. ఇంతలో గార్డులు వచ్చి ప్లకార్డు ప్రదర్శిస్తూ బెలూచిస్తాన్ స్వేచ్ఛ కోసం నినదిస్తున్న వ్యక్తిని బయటకు లాక్కుపోయారు. దీనిపై పాక్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. టీవీ చర్చల్లోనూ, పత్రికల్లోనూ ఇదే వార్త పతాక వార్త అయి కూర్చుంది. అంతర్జాతీయ స్థాయిలో తాను ఒకటి చేయబోతే మరొకటి జరగడం నవాజ్ జీర్ణించుకోలేకపోతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balochistan  Barack Obama  Nawaz Sharif  Osama bin Laden  Pakistan  US  US Institute of Peace  

Other Articles