kcr examined by CBI team in 2006 case

Telangana cm examined by cbi team in 2006 case

KCR CBI, kcr quizzed by cbi, kcr 2006 case, National Building Construction Corporation (NBCC), Executive Engineer of the A.P. Fisheries Department, construction of ESI Hospitals,. K. Chandrasekhar Rao, CBI questioning, kcr 2006 corruption case, CBI case against kcr in 2011, K. Chandrasekhar Rao, CBI questioning, 2006 corruption case

The CBI examined Telangana CM K. Chandrasekhar Rao in a case relating to the award of a contract when he was the Union Minister of Labour, Employment and Training in 2006.

సీఎం కేసీఆర్ దూకుడుకు కేంద్రం కళ్లెం.. పాత కేసును తిరగదోడుతున్న వైనం..!

Posted: 10/21/2015 10:25 AM IST
Telangana cm examined by cbi team in 2006 case

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును సిబిఐ విచారించిందా..? అవినీతి రహిత పాలనను అందిస్తామన్న కేసీఆర్ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడ్డారా..? మరెందుకు ఆయనను సిబిఐ విచారించిందన్న ప్రశ్నలు తెలంగాణ ప్రజలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అవును సిబిఐ కేసీఆర్ ను ప్రశ్నించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా దూకుడుగా వ్యవహరిస్తున్న ఆయనకు కేంద్రం కళ్లాలు వేసిందన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఇందుకోసమే పాత కేసులను తిరగదోడి.. విచారణను ముమ్మరం చేస్తు ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయన్న వార్తలు వినబడుతున్నాయి.

ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఆయన పార్టీకి చెందిన ఎంపీలు, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో పాత కేసులో సిబిఐ ఆయనను విచారించడమే ఇందుకు కారణంగా ఆ పార్టీకి చెందిన పలువురు రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అది ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలపై కాదు. కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ ఆయనను విచారించింది. ఈ మేరకు ఆంగ్ల జాతీయ దినపత్రిక ఓ సంచలన వార్తను ప్రచురించింది. అది తెలంగాణలో పెను సంచలనంగా మారింది.

ఒక కాంట్రాక్టుకు సంబందించి విషయంలో ఆయనను ప్రశ్నించినట్లు ఆ పత్రిక తెలిపింది.2006లో కెసిఆర్ కేంద్ర కార్మిక, ఉపాది,శిక్షణ శాఖల మంత్రిగా ఉన్నారు.ఆ సమయంలో ఉమ్మడి ఎపిలో ఇఎస్ ఐ ఆస్పత్రుల భవనాల నిర్మాణ కాంట్రాక్టును నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు కాకుండా ఎపి ఫిషరీస్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఇవ్వడంపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో కెసిఆర్ ను ప్రశ్నించారు.సోమవారం నాడు సిబిఐ హైదరాబాద్ లోని కెసిఆర్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి ప్రశ్నించినట్లు ఈ పత్రిక తెలిపింది.

ఈ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయని భావించిన ఇఎస్ ఐ కార్పొరేషన్ 2007 -08 లోనే విచారణకు చర్యలు తీసుకుంది. దీనిపై వచ్చిన సమాచారం ఆధారంగా 2011 లో ఒక కేసును సిబిఐ నమోదు చేసింది.ఈ భవనాలను పరిశీలించిన ఐఐటి నిపుణులు అవి ప్రమాణికంగా లేవని, ఐదు కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక ఆదారంగా ఈ కేసు నమోదు అయింది.దీనిపై సంబందిత శాఖ ఉన్నతాధికారులను ,కెసిఆర్ కు ఆనాడు వ్యక్తిగత అదికారులుగా పనిచేసినవారిని విచారించిన తర్వాత ఇప్పుడు కెసిఆర్ ను ఈ కేసులో ప్రశ్నించినట్లు వచ్చిన సమాచారం సంచలనంగా మారింది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K. Chandrasekhar Rao  CBI questioning  2006 corruption case  

Other Articles