Know about ap new capital Amaravati

Ap chandrababu amaravati ap capital capital amaravati amaravati history

AP, Chandrababu, Amaravati, AP Capital, capital Amaravati, Amaravati History

Ap New capital Amaravati unknown history revealed in this video. Amaravati inauguration on tomorrow. New History stars from tomorrow feom the state of ap.

ITEMVIDEOS: అమరావతి గురించి తెలియనివి

Posted: 10/21/2015 10:45 AM IST
Ap chandrababu amaravati ap capital capital amaravati amaravati history

ఒక ఫోటో ఎన్నో భావాలను పలికిస్తుంది అని అంటుంటారు.. అలాగే ఓ వీడియో ఎన్నో విషయాలను కూడా చెబుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ వీడియోలో ఎన్నో అంశాలను అందరికి అర్థమయ్యేటట్లు తెలుపవచ్చు. అంగరంగ వైభవంగా సాగుతున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో అందరూ బిజీ బిజీగా ఉన్నారు. మరి చరిత్రలో చోటుచేసుకున్న విషయాలు, భవిష్యత్తులో జరిగే అద్భుతాలు ఎలా ఉంటాయి అన్న దానికి రూపాన్నిస్తూ ఓ వీడియో వచ్చింది. అమరావతి ప్రాభవాన్ని కళ్లకు కట్టేలా వీడియో అద్భుతంగా రూపొందించారు. అమరావతి విశేషాలను.. చరిత్రలో గతించిన అంశాలను తెర మీదకు తీసుకువస్తూ వీడియోలో అన్ని అంశాలను ప్రస్తావించారు.

అమరావతి అద్భుత చరిత్ర, విశేషాల వీడియోను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎప్పటికీ వర్థిల్లే లక్షణాలు ఉన్న నగరాలంటూ చరిత్రకారులు ఏర్చికూర్చిన జాబితాలో చోటు దక్కించుకోదగ్గ నేల అమరావతి. బౌద్దానికి పుణ్యభూమిగా మారి.. ప్రపంచానికి శాంతి వచనాలు బోధించింది ఈ నేల నుండే. ప్రపంచానికి కొత్త దశను.... దార్శనికతను చాటిచెప్పిన మహానుభావులు కూడా ఈ నేల మీద నుండే తమ ప్రస్థానాన్ని కొనసాగించారు. మన విశిష్ట స్థలి అమరావతి మళ్లీ… ఇన్నాళ్లకి పూర్వ వైభవాన్ని పుణికిపుచ్చుకోబోతోంది. అందుకే ఎప్పటికీ నిలిచిఉండే అజరామర రాజధానుల్లో అమరావతికి కచ్చితంగా స్థానం ఉంటుంది. చరిత్రే నిదర్శనం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Chandrababu  Amaravati  AP Capital  capital Amaravati  Amaravati History  

Other Articles