AP CM Chandrababu Naidu is the brand ambassador

Ap cm chandrababu naidu is the brand ambassador

Chandrababu Naidu, AP, Amaravati, Amaravati News, Amaravati Updates, Amaravati inauguration, Chandrababu

Ap New capital Amaravati inauguration on Dassara. Chandra babu Naidu decided to build new capital as a world class smart capital.

ఏపి ప్రజలకు చంద్రబాబు ‘‘ఒక్కమగాడు’’

Posted: 10/20/2015 01:41 PM IST
Ap cm chandrababu naidu is the brand ambassador

విభజన సజావుగా జరగలేదు.. న్యాయం అనే మాటపు పూర్తిగా మరిచిపోయి కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పుకు ఏపి ప్రజలు బలవుతున్నారు. భవిష్యత్ మీద పూర్తిగా ఆశలు కోల్పోయిన ఏపి ప్రజలకు దిక్కెవరు..? ఏపిని తిరిగి నెంబర్ వన్ గా ఎలా చెయ్యగలరు..? ఎవరు చెయ్యగలరు..? ఇలా విభజన తర్వాత ఆంద్రుల మదిలో తలెత్తిన ప్రశ్నలు. కానీ ఎన్నికల్లో తమ నాయకుడు ఎవరో.. తమను ఎవరు నడిపించగలరో.. అంత ముందు చూపు.. పరిపాలన మీద అవగాహన కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడే అని వారు గాఢంగా విశ్వసించారు అందుకే పూర్తి మెజారీటీతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కించారు. ఇక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి చంద్రబాబు ఏపికి కావాల్సిన అన్ని అవసరాల మీద దృష్టిసారించారు. ఏపి ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు కాలాన్ని అదిగమించేలా కొత్త పరిశ్రమలను కేవలం తన బ్రాండ్ తో ఏపికి తీసుకురాగలుగుతున్నారు. దేశ విదేశాలు జల్లెడ పట్టి కొత్త టెక్నాలజీని, కొత్త ఆలోచనలను ఒడిసిపట్టి ఏపి ప్రజల వాకిల్ల ముందుకు తీసుకువస్తున్నారు. అలాంటి వాడే తమ నాయకుడు అని ప్రతి ఆంధ్రుడు గర్వపడేలా.. చేస్తున్నారు. అన్నింటికి మించి రాజధాని కూడా లేకుండా ఏర్పడిన మొదటి రాష్ట్రంగా ఏపి అవతరించింది. కానీ దురదృష్టంలో కూడా అదృష్టాన్ని వెతికే నాయకుడు ఉన్నంత వరకు ఎలాంటి భయం అక్కర్లేదని ఆంధ్రులు బాగా గుర్తించారు.

అమరావతి.. బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే
అమరావతి.. ఇది ట్రెండింగ్ న్యూస్ కాదు.. ట్రెండ్ సెట్ చేయబోయే ఇండియా సింగపూర్. టెక్నాలజీని అవపోసన పట్టిన చంద్రబాబు తన మేధోశక్తిని అమరావతికి అంకితం చేస్తున్నారు. అమరావతి నమూనా చూసిన వాళ్లందరూ ఇలాంటి రాజధానిని కేవలం కలలో మాత్రమే చూడగలం అని అన్నారు. కానీ అక్కడ విజన్ కు....మారుపేరుగా నిలిచే చంద్రబాబు నాయుడు ఉంటే అసాధ్యం అన్న మాటకు చోటుండదు. అమరావతి అన్న పేరు మొన్నటి దాకా చాలా మందికి తెలియదు. కానీ అక్కడ పరిశ్రమలు వేల కోట్ల రూపాయలతో స్థాపించడానికి దేశ, విదేశ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దానికి ఎవరు కారణం.? ఒకే ఒక్కడు ఆ ఒక్కడే నారా చంద్రబాబు నాయుడు. వేల కోట్ల రూపాయలను రాష్ట్రానికి తీసుకురావడం కాకుండా.. స్థానికంగా ఉండేవాళ్లకు ఉపాధిని కల్పిస్తూ.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు.

అమరావతి= అమరావతి
బారతదేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి.. ఎన్నో రాజధానులున్నాయి. కానీ అందరి చర్చ.. అందరి చూపు కేవలం ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. అమరావతి నిర్మాణం ఎలా ఉంటుంది. కేవలం సినిమాల్లో సెట్టింగ్ లు వెయ్యడానికే చాలా టైం పడుతుంది.. చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి అదిరిపోయే అమరావతి నిర్మాణం ఎలా పూర్తవుతుంది. దానికి ఒకే ఒక్క సమాధానం చంద్రబాబు. చంద్రబాబు అన్న పేరుతో అమరావతి నిర్మాణం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది అని ఎంతో మంది నమ్ముతారు. అందుకే అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. తెలుగు మీడియా మాత్రమే కాదు. నేషనల్ మీడియా కూడా అమరావతికి పూర్తి కవరేజ్ ఇస్తోంది. ఇక శంకుస్థాపన నాడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు ఖచ్చితంగా వస్తాయి. గత మూడు రోజులుగా ట్రెండ్ అవుతున్న పేరు అమరావతి.. దాని వెనకాల ఉన్న పేరు చంద్రబాబు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles