congres parties wont go to amaravati inauguration

Congres parties wont go to amaravati inauguration

Amaravati, AP, Chandrababu Naidu, Chandra Babu Naidu on Amaravati, Amaravati News, AMaravati inauguration, Amaravati Inauguration on Dasara, Chandrababu naidu at Uddanrayapalem, Uddandarayapalem, Guntur, Amaravati the people capital, AP capital Amaravati

APs new capital amaravati inauguration ceremony plans grandly on Dasara. YSR congress party already conformed that they dont attend the ceremony programme. Recently congress party leaders also not attending the amaravati ceremony.

ఆ కాంగ్రెస్.. ఈ కాంగ్రెస్ అమరావతికి దూరం దూరం

Posted: 10/20/2015 04:10 PM IST
Congres parties wont go to amaravati inauguration

అమరావతికి అందరూ వస్తున్నారు... మోదీ దగ్గర నుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా లక్షల మంది సమక్షంలో అంగరంగ వైభవంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనుంది ఏపి ప్రభుత్వం. కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వారి సంఖ్య భారీగా ఉండగా.. హాజరు కాని వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎంత మంది వస్తున్నారో లెక్కించడం కష్టమే.. కానీ ఆహ్వానించినా రాని వారి జాబితా చాలా చిన్నగా ఉంది. తాజాగా తాము అమరావతి శంకుస్థాపనకు రావడం లేదని వెల్లడించారు ఏపి కాంగ్రెస్ నాయకులు. మాజీ మంత్రి శైలజానాథ్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. కాగా ఏపి కాంగ్రెస్ నాయకులు ఎందుకు రావడం లేదు అన్న కారణం కొత్తగా అనిపిస్తోంది. అందరూ అమరావతికి పయనమవుతుంటే.. ఏపి కాంగ్రెస్ నాయకులు మాత్రం అందుకు విరుద్దంగా ఆలోచిస్తున్నారు.

అసలు ఏపి కాంగ్రెస్ నాయకులు చెప్పిన కారణం ఏంటో తెలుసా..? అమరావతి ఆహ్వానం సరిగ్గా లేదట. అవును అమరావతి ఆహ్వానం సరిగ్గా లేదని ఆరోపిస్తూ.. ఏపి కాంగ్రెస్ నాయకులు అమరావతి శంకుస్థాపనకు రావడం లేదని స్పష్టం చేశారు. అమరావతి శంకుస్థాపనకు తనను పిలిచినా... రానని.. ఆహ్వానం అందించవద్దని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా కాంగ్రెస్ సార్టీ నాయకులు కూడా రావడం లేదని ప్రకటించడం వార్తల్లో నిలుస్తోంది. ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రధాని మోదీని అపాయింట్ మెంట్ కోరితే.. ఇవ్వలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వివరించారు. మొత్తంగా ముందు పిల్ల కాంగ్రెస్ తర్వాత తల్లి కాంగ్రెస్ నాయకులు తాము అమరావతి అంకురార్పణకు రావడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు దృష్టిలో ప్రతీసారి పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అనే మాటలు... ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయి. పార్టీల పేర్లు వేరయినా కానీ రెండింటి ఆలోచనా విధానం మాత్రం ఒక్కటేలా ఉంది అని కొంత మంది విమర్శిస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను ఎందుకు రావడం లేదో వివరిస్తు... జగన్ రాసిన లెటర్ మీద చాలా మంది విమర్శలు చేశారు. జగన్ అసంబద్ద కారణాలను సాకుగా చూపిస్తూ.. ఆంధ్రుల చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మక ఘట్టానికి హాజరుకాకపోవడం మీద సొంత పార్టీ నాయకులే మండిపడుతున్నారు. మరి జగన్ చెప్పినట్లే కనీసం నమ్మడానికి వీలుకాని వాటిని సాకులుగా చూపుతూ తల్లి కాంగ్రెస్ నాయకులు అమరావతి శంకుస్థాపనకు డుమ్మా కొట్టడం ఏంటా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో తాము పాల్గొన్నా కానీ ఆ క్రెడిట్ చంద్రబాబుకు చెల్లుతుంది తప్పితే.. తమకు ఎలాంటి ప్రయోజనం కలుగదు అనే భావనతోనే కాంగ్రెస్ ద్వయం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు కూడా పుకార్లు షికారు చేస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles