Amazon files another suit

Amazon files another suit in fight against bogus reviews steelers lounge

amazon, Review, Amazon file case, Amazon files suit, Amazon product review

One Fiverr user that went by bess98 offered to write the reviews from multiple computers, so as to deceive Amazon. Fiverr is an online marketplace that lets people sell simple services to strangers, like transcribing audio, converting photos or editing video. Earlier this year, the company sued a number of websites for offering similar fake review services. Steelers Lounge

ఆ కస్టమర్ల మీద అమెజాన్ కేసులు

Posted: 10/19/2015 01:56 PM IST
Amazon files another suit in fight against bogus reviews steelers lounge

అమెజాన్.. ఆన్ లైన్ షాపింగ్ రారాజుగా ఉన్న అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ. అయితే నిన్న మొన్నటి దాకా ఆఫర్లతో అందరిని మెస్మరైజ్ చేసిన అమెజాన్ తాజాగా కొంత మంది మీద కేసులు పెట్టింది. తన కస్టమర్ల మీదే అమెజాన్ కేసులు పెట్టడం వార్తల్లో నిలిచింది. తమ వెబ్ సైట్లో తప్పుడు రివ్యూలు రాస్తున్నారని 1,114 మంది పై కేసులు పెట్టింది. వీరంతా పలు ప్రొడక్టుల పనితీరు బాగాలేదంటూ, ఓ పథకం ప్రకారం ఇతర కస్టమర్లను పక్కదారి పట్టించేలా సమీక్షలు రాస్తున్నారని ఆరోపించింది. జాన్ డోయిస్ అనే గుర్తు తెలియని అమెరికన్, తాను ఐదు డాలర్లతోనే తప్పుడు రివ్యూలు రాస్తానని 'ఫైవెర్ డాట్ కాం' ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడని, ఇతను ఎవరన్నది తేల్చేందుకు దర్యాఫ్తునకు పోలీసులను అనుమతించాలని కోర్టును కోరింది.

సినిమాలకు కొంత మంది తప్పుడు రివ్యూలు రాస్తూ.. రేటింగ్ ఎక్కవ ఇవ్వడం చూశాం.. తాజాగా ఈ కామర్స్ సైట్ లలో పోటీ పెరిగిపోవడంతో.. ఇలా పోటీకి పోయి ఒక సైట్ మీద మరో పైట్ వాళ్లు రాయిస్తున్నారని అనుకుంటున్నారు. ఫేక్ రివ్యూలు రాస్తున్న వారందరి ఐడీలనూ కోర్టుకు అందించింది. తప్పుడు రివ్యూలను రాస్తున్న వారిలో అమేజాన్ నుంచి ప్రొడక్టులను కొనుగోలు చేసిన వారూ ఉన్నారని తెలుస్తోంది. పలు వెబ్ సైట్లు వివిధ రకాల ప్రొడక్టులపై తప్పుడు ప్రచారం సాగించేందుకు సహకరిస్తూ, అవి బాగాలేవని చెప్పే రివ్యూలను విక్రయిస్తుంటాయి. ఈ తరహా ప్రచారం పెరగడం తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నాయని.. కస్టమర్లు ఇలా తప్పుడు రివ్యూలతో తప్పుదోవ పడుతున్నారని.. అమెజాన్ వాదిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amazon  Review  Amazon file case  Amazon files suit  Amazon product review  

Other Articles