Baby bear gets wedged in a window and struggles to escape after getting into a home | baby bear news

Baby bear gets wedged in a window and struggles to escape

drunken baby bear, bear struggles to escape, baby bear wedged in window, baby bear videos, bear videos

Baby bear gets wedged in a window and struggles to escape : Baby bear gets wedged in a window and struggles to escape after getting into a home.

ITEMVIDEOS: వైన్ దొంగతనానికొచ్చింది.. ఇరుక్కపోయింది..

Posted: 10/19/2015 01:27 PM IST
Baby bear gets wedged in a window and struggles to escape

ఎక్కడో అటవిప్రాంతం నుంచి వచ్చిన ఓ పిల్ల ఎలుగుబంటి వైన్ దొంగలించడానికి ఓ ఇంట్లో ప్రవేశించింది. ఆ వైన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నించింది. ఇంతలోనే ఆ ఇంటి యజమాని కనిపించడంతో భయపడిన ఎలుగుపిల్ల.. వెంటనే పారిపోయేందుకు ప్రయత్నించింది. పక్కనే వున్న కిటిలోనుంచి దూకి పారిపోదామని ట్రై చేసింది. కానీ.. కిటికీ కేవలం కొద్దిగా తెరిచి వుండటం వల్ల అది ఇరుక్కుపోయింది. బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా.. ఫలించలేదు. అయినప్పటికీ అది తన పంథాను వదులుకోలేదు. ఎలాగోలా వెళ్లాలని ఫిక్స్ అయి, తన ప్రయత్నాన్ని ముమ్మరం కొనసాగించింది. తంటాలు పడుతూ చివరికి ఎలాగోలా కిటికీలోంచి దూకి అడవిలోకి పారిపోయింది.

అచ్చం ఓ టెలివిజన్ షోలోలాగే సాగిన ఈ ఎలుగుపిల్ల ఎస్కేప్ ప్రయత్నాన్ని ఆ ఇంటి యజమాని తన సెల్ ఫోన్ లో బంధించాడు. ‘ఎలుగు అవస్థ చూసి తాము సాయం చేద్దామనుకున్నామని.. కానీ చిన్ని ఎలుగు పిల్ల కూడా చాలా ప్రమాదకరమని.. ఇంటి యజమాని ట్విట్టర్ లో కామెంట్ చేస్తూ వీడియోని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం రష్యన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్గా మారిన వీడియోని తూర్పు రష్యా అటవీ అధికారులు కూడా చూశారు. ఆ ఇంటి యజమాని చేసిన కామెంట్ కి స్పందిస్తూ.. ‘ఇంటి యజమాని ఎలుగు దగ్గరికి పోకుండా మంచి పని చేశాడు. ఎలుగులు ఎప్పుడూ ప్రమాదకరమైనవే’ అంటూ వారు రీట్వీట్ చేశారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఆ ఎలుగుపిల్ల వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles