Pawan Kalyan security persons on Media

Pawan kalyan security persons on media

Pawan Kalyan, Pawan Kalyan News, Pawan Kalyan said sorry, Pawan Kalyan News, janasena Party, Media on Pawan Kalyan, Pawan Kalyan on Media, pawan Kalyan security, Pawan kalyan fans, Pawan Kalyan updates

Pawan Kalyan security persons on Media. Pawan Kalyan security persons attack on media bymistake. Pawan Kalyan said sorry about that and specially to that media person who injured in this incident.

ITEMVIDEOS: క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్.. అసలేం జరిగింది.?

Posted: 10/17/2015 01:32 PM IST
Pawan kalyan security persons on media

జనసేన పార్టీ అధ్యక్షుడు, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ కు ఏపి రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ఆహ్వాన పత్రికను అందించేందుకు మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు చేరుకున్నారు. అయితే ఆ వార్తను కవర్ చెయ్యడానికి మీడియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే మీడియా సిబ్బంది మీద పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది దాడికి దిగారు. మీడియా జర్నలిస్ట్ మీద దాడికి దిగడంతో పాటు.. కెమెరా కూడా ధ్వంసమైంది. అయితే అన్ని మీడియా చానల్స్ లో పవన్ బౌన్సర్ల ఓవరాక్షన్ అని వార్తలు వచ్చాయి. కాగా జరిగిన దాని ఘటన మీద పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా జరిగిన తప్పు అని.. ఎంతో మంది షూటింగ్ సమయంలో వస్తుంటారని.. అలా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో  బౌన్సర్ లు కాస్త దురుసుగా ప్రవర్తిస్తారని అన్నారు. కానీ మీడియా ఛానల్స్ లో మాత్రం పవన్ కళ్యాణ్ బౌన్సర్ల దాడి గురించి ప్రధానంగా వార్తలు వేశాయి.. కానీ నిజానికి అక్కడ ఏం జరిగింది అన్నది మాత్రం వెయ్యలేదు. మరి నిజంగా అక్కడ ఏం జరిగింది.

పవన్ కళ్యాణ్ అంటేనే అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న తెలుగు సినిమా స్టార్. అలాగే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న పొలిటీషియన్ కూడా. అయితే అమరావతి శంఖుస్థాపనకు సంబందించిన ఆహ్వాన పత్రికను అందించేందుకు మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోకు చేరుకున్నారు. అయితే అమరావతి శంఖుస్థాపన ఆహ్వాన పత్రికను రామానాయుడు స్టూడియోలో మంత్రులు అందిస్తున్నట్లు ముందుగానే మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో చాలా మందికి ముందే సమాచారం ఉండటంతో రామానాయుడు స్టూడియోకు చేరుకున్నారు. మంత్రులు అక్కడికి చేరుకోగానే కొంత మంది బయటి వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అలా బయటి వ్యక్తులు అనుకొని.. మీడియా జర్నలిస్ట్ మీద అనుకోకుండా దాడి జరిగింది. అయితే దీనికి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. దాడికి సంబందించిన వీడియోను కూడా పవన్ పరిశీలించారు. దాడికి కారకుల మీద తను యాక్షన్ తీసుకుంటానని కూడా అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని పవన్ కళ్యాణ్ వివరించారు. మీడియాతో కానీ మరెవరితోనైనా పవన్ కళ్యాణ్ చాలా గౌరవంగా మాట్లాడతారు. కానీ మీడియాలో పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పిన దాని కన్నా.. దాడి ఘటనకు ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు. మీడియాలో వస్తున్న కథనాలు నిజానికి వాస్తవమే కానీ వన్ సైడ్ అంటే కేవలం దాడి గురించి మాత్రమే వార్తలు రాయడం కరెక్ట్ కాదు. బౌన్సర్లు ఎందుకు దాడికి దిగారు.. అక్కడి పరిస్థితి ఏంటీ అన్న అంశాలను కూడా మీడియా చర్చిస్తే బాగుంటుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles