Starting January 2016, telcos must pay users for call drops: Trai

Compensate for call drops from jan 1 2016 trai to telcos

call drops, trai call drops, call drop news, call drops latest news, airtel call drops, Sectoral regulator TRAI, telecom operators, compensate consumers for call drops, pre-paid customers, post paid customers next month bill, poor mobile service quality

TRAI said a telecom operator should send a message through SMS or USSD to the calling customer within four hours of the occurrence of call drop and the details of amount credited in his account

బహుపరాక్.. బహుపరాక్.. ! ట్రాయ్ నిర్ణయం బహుపరాక్..!! కాల్ కట్ అయితే రూపాయి వచ్చే..!!!

Posted: 10/16/2015 01:51 PM IST
Compensate for call drops from jan 1 2016 trai to telcos

సెల్ ఫోన్ వినియోగదారులకు భారత్ టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ (ట్రాయ్) శుభవార్తనందించింది నగర, పట్టణ శివారు ప్రాంతాల్లోకి నాణ్యత కొరవైన సర్వీసులను అందిస్తూ.. మోబైల్ ఫోన్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్న టెలికామ్ కంపెనీలపై కోరడా ఝుళిపించింది. ఇకపై మోబైల్ ఫోన్ వినియోగదారులకు కాల్ డ్రాప్ ల నుంచి ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. 'కాల్ డ్రాప్స్'కు పరిహారం చెల్లించాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ప్రతి కాల్ డ్రాప్ కు రూపాయి చొప్పున చెల్లించాలని.. ఇది 2016, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇంకా నాణ్యతాయుతమైన సేవలను అందించలేని పక్షంలో ఆయా సర్వీసు దారులకు రెండు లక్షల రూపాయల వరకు పెనాల్టీ విధించే దిశగా ట్రాయ్ అదేశాలు జారీ చేసింది. రోజులో మూడుసార్లు మాత్రమే ఈ పరిహారం అందుతుందని తెలిపింది. ఫోన్ లో మాట్లాడుతుండగా మధ్యలో కట్ అయితే నాలుగు గంటల్లోగా పరిహారం అందించాలని సూచించింది. పరిహారం అందించిన విషయాన్ని వినియోగదారుడి ఎస్ఎంఎస్ లేదా యూఎస్ఎస్డీ ద్వారా వినియోగదారులకు తెలపాలని ఆదేశించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు తర్వాత నెల బిల్లులో వివరాలు పేర్కొనాలని సలహాయిచ్చింది. తాము వెలువరించిన ఆదేశాలను టెలికం ఆపరేటర్లు ఏమేరకు పాటిస్తున్నారనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుంటామని తెలిపింది. కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారం అయ్యేందుకు సర్వీసు ప్రొవైడర్లు ప్రయత్నించాలని సూచించింది. దీనిపై ఆరునెలల తర్వాత మరోమారు సమీక్ష నిర్వహిస్తామని ట్రాయ్ తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : call drop  telecom operators  TRAI  service providers  

Other Articles