Soon, get a spot approval for personal loans on HDFC ATMs

Hdfc bank atms to offer spot loans

personal loan, loan-on-ATM, HDFC Bank ATM, automated teller machines, ATM, HDFC, loan, hdfc bank, spot approval for personal loan, HDFC Bank personal loans, CIBIL

ATMs which took over the job of the cash teller over the last three decades, are now replacing another bank position — that of a credit officer for small loans.

లోన్ కావాలా నాయనా...? డాక్యూమెంట్లు వద్దు.. ఏటీయం కార్డుంటే చాలు

Posted: 10/16/2015 04:13 PM IST
Hdfc bank atms to offer spot loans

మీకు అర్జెంటుగా చిన్న మొత్తం రుణంగా కావాలా..? ఏ ప్రైవేటు ఫైనాన్సర్ దగ్గరికో వెళ్తే సరి అని అనుకుంటున్నారా..? అయితే మీ అలోచనలు మానుకోండి. ఇకపై మీకు చిన్నపాటి మొత్తం లోన్ గా కావాలంటే.. మీ బ్యాంకు ఏటీయం ను నమ్మకోండి. అబ్బే బ్యాంకు నుంచి రుణం పోందాలంటే వారడిగే శతకోటి ప్రశ్నలు, అందుకు సంబంధించిన డాక్యూమెంట్లు కూడా లేవు. వున్న కాగితాలతో వారు రుణం ఇవ్వరు అనుకుంటూ నిట్టూర్చుతున్నారా..? అయితే మీకు పస్పులో కాలేసినట్టే. ఇకపై మీకు ఆ చింత లేదు.

ఎందుకంటే ఇకపై బ్యాంకు నుంచి చిన్నపాటి రుణం పోందేందుకు కేవలం ఏటీఎం కార్డు మాత్రమే చాలు. అదే ఎనీ టైమ్ మనీ కార్డు ఇపుడు ఎనీ టైం లోన్ కార్డ్ గా కూడా అవతరించింది. ఏటీఎం ద్వారా అప్పటికప్పుడు లోన్ తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తూ  హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో గత మూడు దశాబ్దాలుగా  మన జీవితాల్లో పెనవేసుకుపోయిన  ఏటీఎం కార్డు ఇపుడు మరో విప్లవాత్మక పాత్ర పోషించనుంది. ఎనీ టైం లోన్ తో ఏటీఎం కార్డు ద్వారా  చిన్న మొత్తంలో  రుణాలు తీసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తోంది. వ్యక్తిగత రుణాల వ్యవస్థను బలోపేతం చేసిన హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంకు తమ దగ్గర ఉన్న  వినియోగదారుల ఖాతాకు సంబంధించిన వివరాలు తదితరాలను పరిశీలించి అప్పటికప్పుడు రుణం తీసుకునే సదుపాయాన్ని  కల్పించింది.

ఈ వివరాలను పరిశీలించేందుకు  బ్యాంకుకు సంబంధించిన ఆన్ లైన్ పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత కేవలం పది నిమిషాలు సరిపోతుందని బ్యాంక్ తెలిపింది. ఈ పద్ధతి ద్వారా వినియోగదారులను, ఖాతాదారులను పెంచుకునేందుకు బ్యాంక్ పథక రచన చేసింది.  ఈ  క్రమంలో ఏటీఎంల సంఖ్యను బాగా  పెంచుకుని తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఆలోచిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్..  నో.. ఎనీ టైం మనీ.. అని పిలిచే ఏటీఎం  ఇపుడు ఎనీ టైం లోన్ అంటూ దూసుకుపోవడానికి రెడీ అవుతోంది. ఇక ఇదే బాటలో అన్ని బ్యాంకులు కూడా నడిచేందుకు సిద్దమవుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ATM  HDFC  loan  hdfc bank  personal loan  loan-on-ATM  HDFC Bank ATM  automated teller machines  

Other Articles