Mahendra Singh Dhoni Slams His 60th ODI Fifty at Indore

South africa edge india in thrilling 2nd odi opener

challenging to maintain momentum, one day international, ravichandran ashwin, virat kohli, india vs south africa, washed out | Virat Kohli | Rohit Sharma | Ravichandran Ashwin | Kolkata | Hashim Amla, AB De Villiers, captain, India, south africa, team india, MS Dhoni, cricket news

India have never lost an ODI in Indore's Holkar Stadium. Mahendra Singh Dhoni's team will be under pressure to bounce back in the five-match ODI series after South Africa took the lead in Kanpur

రెండో వన్డేలో టాప్ ఆర్డర్ విఫలం.. ధోని అద్భుత హాప్ సెంచరీ

Posted: 10/14/2015 04:24 PM IST
South africa edge india in thrilling 2nd odi opener

దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. టాపార్డర్లో రహానె (51) హాఫ్ సెంచరీ చేయడం మినహా ఇతర బ్యాట్స్మెన్లు విఫలం కావడంతో.. జాగ్రత్తాగా అడుతోంది టీమిండియా. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్ తో తన 60వ హాజ్ సెంచరీని పూర్త చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎన్నడూ వన్డేలలో మ్యాచ్ ఓటమిని చవిచూడని ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతన్న మ్యాచ్లో భారత్ 43 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ధోనీ, హర్భజన్ సింగ్ బ్యాటింగ్ చేస్తున్నారు. సౌతాఫ్రికా బౌలర్లు మోర్కెల్ రెండు, తాహిర్, రబడా, స్టెయిన్ తలా వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ధోనీసేన ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 3 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (3) రబడా బౌలింగ్లో బౌల్డవయ్యాడు. ఆ తర్వాత ధవన్, రహానె జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. కాసేపటి తర్వాత ధవన్(23).. మోర్కెల్ బౌలింగ్లో అవుటవడంతో టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపో్యాడు. జట్టు స్కోరు 82 పరుగుల వద్ద కోహ్లీ (12) రనౌటయ్యాడు. క్రీజులో కుదురుకున్న రహానె కూడా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే.. ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో బౌల్డయ్యాడు.

ఇక రైనా రావడం ఆలస్యమన్నట్టు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. అక్షర్ పటేల్ (13).. స్టెయిన్ బౌలింగ్లో విక్కెట్ల ముందు దొరికిపోయాడు. ఇక ఏడో వికెట్ గా భువనేశ్వర ప్రసాద్ దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజ్ లో వున్న జట్టు సారధి మహేంద్రసింగ్ ధోని నిలకడగా అడుతూ భారత్ కు గౌరవప్రదమైన స్కోరును కల్పించేందుకు కృషి చేస్తున్నాడు. స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. ప్రస్తుతం 57 బంతులను ఎదుర్కోన్ని అర్థశతకాన్ని నమోదు చేసిన ధోని.. జోరును కోనసాగించనున్నాడు. మరో ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా డుమిని బౌలింగ్ లో ఒక ఫోరు, ఒక సిక్స్ సాయంతో రాణించాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  south africa  team india  MS Dhoni  cricket news  

Other Articles