Barack Obama attend the marriage without invitation

President obama crashed a wedding

obama crashes wedding, obama torrey pines wedding, obama wedding

President Barack Obama became the wedding-crasher-in-chief this weekend after a round of golf at Torrey Pines in San Diego.The president was finishing up his round just as it was time for Brian and Stephanie Tobe's wedding ceremony at The Lodge at Torrey Pines. The 18th hole was near where the wedding altar was going to be.

పిలవని పెళ్లిలో సందడి చేసిన ఒబామా

Posted: 10/14/2015 05:06 PM IST
President obama crashed a wedding

పెళ్లికి అందరూ వస్తే వచ్చే ఆనందమే వేరు. అందరు వస్తుంటే పెళ్లిలో కళ.. అతిథులతో పెళ్లి సందడి దుమ్మురేగుతోంది. అయితే అనుకోకుండా ఓ అతిథి పెళ్లికి వస్తే.. వచ్చిన ఆ సెలబ్రెటి ఓ దేశానికి ప్రెసిడెంట్ అయితే ఎలా ఉంటుంది. భీభత్సం, ఆశ్చర్యం, ఆనందం ఇలా ఎన్ని రకాల ఎక్స్ ప్రెషన్స్, ఫీలింగ్స్ ఉంటే అన్నీ వస్తాయి. కాలిఫోర్నియాలో పెళ్లి చేసుకుంటున్న స్టిఫానీ, బ్రియాన్ టోబేలు తమ వివాహాన్ని లా జొల్లా లోని గోల్ఫ్ కోర్స్ లో వేడుకా జరపాలని నిర్ణయించుకున్నారు. అదే సమయానికి కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ఒబామా అదే ప్రాంతంలో పర్యటనకు వచ్చారు.

తొలుత మమ్మల్ని వివాహ వేడుకను వెంటనే ముగించండి లేదా కాస్త ఆలస్యంగా మొదలు పెట్టుకోండి" అని ఆయన రక్షణ సిబ్బంది కోరినట్టు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఎరిన్ సీఎన్ఎన్ కు తెలిపారు. సీక్రెట్ సర్వీసెస్ కు చెందిన రెండు ఎస్యూవీలను చూసిన తరువాత, అందులో ఉన్నది ఎవరో మాకు తెలిసిందని టోబ్ వ్యాఖ్యానించారు.  మొత్తానికి అక్కడికి వచ్చి.. వారితో కలిసి ఫోటోలు దిగి.. వధూవరులకు బంపర్ ఆఫర్ అందించారు. ఇది తమకు జీవితాంతమూ గుర్తుండి పోతుందని ఆ జంట ఇప్పుడు ఆనందంగా చెప్పుకుంటోంది. గత సంవత్సరం ఓ గోల్ఫ్ కోర్సులో ఒబామా కోసం భద్రతా సిబ్బంది బలవంతంగా ఓ పెళ్లిని రద్దు చేయడం విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారి ఆనందానికి అడ్డు వచ్చినందుకు ఒబామా క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama crashes wedding  obama torrey pines wedding  obama wedding  

Other Articles