End of an era: 'Playboy' magazine to do away with naked pictures

Playboy covers up no more dirty pictures

Playboy magazine, Playboy Mansion, Hugh Hefner, Scott Flanders, Playboy magazine, nude photos, women photos, internet, porn sites, Hugh Hefner,

Playboy magazine is known for its nude spreads. But as the iconic magazine is going through a major overhaul, the decision to publish no nudes makes a part of it.

ప్లేబాయ్.. ఇకపై గుడ్ బాయ్.. అనవసర చెత్తకు గుడ్ బై..!

Posted: 10/13/2015 10:12 PM IST
Playboy covers up no more dirty pictures

ప్లేబాయ్ ఇకపై గుడ్ బాయ్ కానున్నాడు. కాదు కాదు ప్లేబాయ్ ఇకపై గుడ్ బాయ్ కానుంది. అదేంటి ఇంట్రో విచిత్రంగా వుందనుకుంటున్నారా..?  తప్పులు రాశారు చూసుకోండి అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నట్లు కూడా వున్నారు. అయితే మేము రాసిన వ్యాఖ నిర్మాణం కరెక్టుగానే వుంది. మీ సందేహం ఇంతకీ ఎవరా ప్లేబాయ్ అనేగా, అతనెందుకు ఇప్పుడు గుడ్ బాయ్ గా మారుతున్నాడు.. అనేగా.. మీ సందేహాలు తీరాలంటే ఈ సారంశం చదవాల్సిందే. గత కొన్ని శతాబ్దాలుగా కుర్రకారు మతులు, గమ్మత్తుగా మత్తెక్కించే అమెరికా మేగజైన్ ప్లేబాయ్.

పెద్దలకు మాత్రమే' వంటి శృంగార చిత్రాల తరహాలో.. కుర్రకారుకు మతులు పోగొట్టిన  'ప్లేబాయ్' మేగజైన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేగజైన్లో మహిళల నగ్న చిత్రాలు ప్రచురించరాదని యాజమాన్యం నిర్ణయించింది. రీ డిజైన్ చేసిన కొత్త మేగజైన్ను వచ్చే మార్చిలో ఆవిష్కరించనున్నారు. ప్రస్తుత ప్లేబాయ్ ఎడిషన్లో రెచ్చగొట్టేలా మహిళ నగ్న చిత్రాలున్నా.. ఇక మీదట పూర్తి నగ్నచిత్రాలు కనిపించవు. ఈ మేగజైన్లో మహిళల నగ్న చిత్రాలను ప్రచురించరాదని ఎడిటర్ కోరీ జోన్స్ వెల్లడించారు.

ప్రస్తుత తరుణంలో నగ్నచిత్రాలు, వీడియోలు అంతర్జాలం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో వుండడమే ఇందుకు కారణం. అంతర్జాల మహిమ వల్ల తాము కావల్సింది అందుబాటులోకి క్షణాల్లో వస్తుండటం వల్ల అడల్ట్ మేగజైన్లకు ఆదరణ తగ్గుతోందని ప్లేబాయ్ ప్రతినిధులు అంగీకరించారు. ప్లేబాయ్ సర్క్యులేషన్ భారీగా పడిపోయినట్టు చెప్పారు. 1975లో ప్లేబాయ్ సర్క్యులేషన్ 56 లక్షలు ఉండగా, ప్రస్తుతం 8 లక్షలకు పడిపోయింది. ఈ మేరకు ప్లేబాయ్ ఎడిటర్ కోరి జోన్స్ ప్రతిపాదించగా, ఇందుకు వ్యవస్థాపకుడు హూగ్ హెఫ్నర్ అంగీకారం తెలిపారు. దీంతో ఇకపై ప్లేబాయ్ మేగజైన్ గుడ్ మేగజైన్ గా మారనుంది.  

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Playboy magazine  nude photos  women photos  internet  porn sites  

Other Articles