Anatomy Teacher Strips Down To Muscluar Clothes To Teach Her Students Lesson

Biology teacher strips in classroom in front of students

biology teacher, teacher striped in class room, Groene Hart Rijnwoude school, netherlands school teacher striping, anatomy teachet strips in classroom, teacher strips to muscular clothes, Debby Heerkens, a biology teacher, teacher's innovative teaching, biology teacher creative approach, Anatomy, Teacher, Strips, Down, To, Muscluar, Clothes, Teach, Her, Students, Lesson, how to, learn, un dress, undress, latest news

Debby Heerkens, a biology teacher at Groene Hart Rijnwoude school, in the small town of Hazerswoude Dorp Netherlands, wanted to try a creative approach to teach a lesson about the human body.

ITEMVIDEOS: విద్యార్థుల ముందు బట్టలు విప్పి.. క్లాస్ తీసుకున్న టీచరమ్మ..!

Posted: 10/13/2015 09:38 PM IST
Biology teacher strips in classroom in front of students

అది అనాటమీ క్లాసు. ప్లస్ టు విద్యార్థులు ముఖ్యంగా జీవశాస్త్రం ఎంచుకునే విద్యార్థులకు మాత్రమే వున్న క్లాసు. అయితే తమ పాఠాలు సరిగ్గా విద్యార్థులకు అర్థం కావడం లేదో..? లేక తన సబెక్టులో విద్యార్థులు మంచి మార్కులు సాధించలేకపోతున్నారో తెలియదు కానీ.. ఓ టీచర్ విద్యార్థులకు క్షుణ్ణంగా పాఠాలు అర్థం కావాలంటే ఏం చేయాలన్న ఆలోచన అమెను వినూత్నంగా అలోచించేలా చేసింది. విద్యార్థుల ఎదుట తాను వేసుకున్న బట్టలను విప్పి.. మరీ క్లాస్ తీసుకుని పాఠాలు అర్థమయ్యేలా చెప్పింది. అయితే టీచరమ్మ ఏకంగా బట్టలు విప్పి మరీ శరీర అవయవాలు ఎలా ఉంటాయో చూపించడంతో ఎదుగుతున్న పిల్లలు షాక్ తిన్నారు..

వివరాల్లోకి వెళితే.. నెదర్లాండ్స్ లో డెబ్బీ హీర్కేన్స్ అనే టీచర్ పిల్లలకు క్రియేటివ్ గా పాఠాలు చెప్పాలనుకుంది..అంతే మనిషి శరీరం లోపలి పార్ట్స్ ఎలా ఉంటాయో చూపే బొమ్మలతో డిజైన్ చేసిన ఓ డ్రెస్ ను ఆ టీచర్ వేసుకొచ్చింది. క్లాస్ రూమ్ లోకి వచ్చిన టీచర్ బట్టలు విప్పేస్తోంటే.. టీచర్ ఏం చేస్తుందంటూ షాక్ అయ్యిన పిల్లలు.. ఆ తరువాత అమె ధరించిన కండరాలు వున్న మస్కులర్ బొమ్మలతో ఉన్న టీచర్ డ్రెస్ చూసి పిల్లలు, తమ టీచర్ క్రియేటివిటి కి ఫిదా అయ్యారు. పిల్లలు చదివిన దానికన్నా చూసిన దాన్ని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారని ఆ టీచర్ ఇలా చేశారు.

మానవ అవయవాల గురించి స్పష్టంగా, పిల్లలందరికీ అర్థం అయ్యేలా చెప్పిన ఆ టీచర్, తర్వాత అది కూడా తీసేసింది. ఈ సారి ఆ డ్రెస్ లోపల మనిషి అస్థిపంజరం బొమ్మ ఉన్న డ్రెస్ ఉంది. అప్పుడు మనిషి ఎముకల నిర్మాణం గురించి పిల్లలకి చెప్పింది.  మానవ అవయవాల గురించి స్పష్టంగా, పిల్లలందరికీ అర్థం అయ్యేలా చెప్పిన అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది..ఇప్పటికి 27 లక్షల మంది చూసారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Debby Heerkens  AnatomyTeacher  Strips Down  Muscluar Clothes  undress  

Other Articles