Individual's Freedom is Being Attacked on a Daily Basis: Maya Krishna Rao

Maya krishna rao returns sangeet natak academy award

New Delhi, sangeet natak akademy,Theatre artist, Maya Krishna Rao, Dadri lynching case, rising intolerance, communal atmosphere, Sahitya Akademy silence, Kannada scholar M. M. Kalburgi, Aravind Malagatti, Shashi Deshpande, Arulu Sahitya awards, modi, PM narendra modi, NDA government

Theatre artist Maya Krishna Rao on Monday returned her Sangeet Natak Akademy award in protest against the Dadri lynching case and the rising intolerance in the country.

నరేంద్రమోడీ ప్రభుత్వంపై కొనసాగుతన్న రచయితల నిరసన

Posted: 10/13/2015 08:47 PM IST
Maya krishna rao returns sangeet natak academy award

నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచయితలు తాము గెలుచుకున్న అవార్డులు వెనక్కి ఇచ్చేయటం కొనసాగుతోంది. తాజాగా నాటకరంగ కళాకారిణి మాయా కృష్ణారావు అదే బాట పట్టారు. 2010లో సంగీత నాటక అకాడమీ తనకు ఇచ్చిన పురస్కారాన్ని ఆమె వెనక్కి ఇచ్చేశారు. సాహిత్య అకాడమీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న రచయితలకు బుకర్‌ ప్రైజ్‌ విజేత సాల్మన్‌ రష్టీ మద్దతు పలికారు. రయితలు, కళాకారులు తమ నిరసన వ్యక్తం చేయడానికి ఇది సరైన పద్ధతి కాదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్‌ శర్మ అన్నారు.

మోదీ పరిపాలనలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నశించిపోతుందంటూ పలువురు రచయితలు తాము గెలుచుకున్న సాహిత్య అకాడమీ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మొదటిసారి ఒర రంగస్థల కళాకారిణి వారికి జత కలిసారు. ఢిల్లీకి చెందిన మాయా కృష్ణారావు తాను 2010లో స్వీకరించిన సంగీత నాటక అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. మాయా కృష్ణారావు ఎన్నో వీఽథినాటకాలు, ఏకాంత్కల్‌లో నటించడం ద్వారా సామాజిక అంశాలపై పోరాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో కళాకారులకు నోరు విప్పే స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి చెప్పిన మాటలను ఆచరించాలని, మోదీ ప్రజలకు పిలుపు ఇవ్వడం సరిపోదని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా మాయా కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ అందరినీ రక్షించడం ప్రభుత్వంలో ఉన్నవారి బాధ్యత అని, అయితే అది జరుగుతోందని నాకు ఏమాత్రం అనిపించడంలేదని అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం భగ్నమైపోతోందని, ప్రతి రోజూ ఓ కొత్త షాక్‌ తగులుతోందని ఓ కొత్త ఉద్రేకం, ఆగ్రహం బైటపడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కొత్త పేర్లతో ఏవేవో సంస్థలు వస్తున్నాయని, విశృంఖలంగా స్వైర విహారం చేస్తున్నాయని ఆమె అన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా వారిని అడిగేవారు, ఆపే వారు లేకుండా పోయారని మాయా కృష్ణారావు వ్యాఖ్యానించారు. హెచ్చరికలకు, బెదిరింపులకు గురవుతున్న ఇలాంటి పరిస్థితిని నేనెప్పుడూ చూడలేదని, మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన వ్యక్తినే చంపేసారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles