vijayakanth takes on tamilnadi cm jayalalitha

Vijayakanth slams on aiadmk party and cm jayalalitha

dmdk party president vijayakanth, aiadmk party, DMDK head, Vijayakanth, jayalalitha, growth of corruption in tamilnadu, no law and order in TN, jayalalithaa cheats MGR alleges vijayakanth

dmdk party president vijayakanth slams on aiadmk party and cm jayalalitha for growth of corruption, and negligence of law and order

ఇదేం పాలన.. ఇదేం శాంతిభద్రతల పరిరక్షణ.. మళ్లీ అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు

Posted: 10/09/2015 05:38 PM IST
Vijayakanth slams on aiadmk party and cm jayalalitha

తనకు అధికారాన్ని అందించిన ప్రజలనే కాదు...దివంగత నేత ఎంజీయార్‌కు సైతం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత పంగనామాలు పెట్టారంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోపించారు. ఇందుకు తగ్గ ఆధారాలు తన వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో డీఎండీకే నేతృత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన అధికార అన్నా డిఎంకే పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అంటూ సీఎం జయలలిత వ్యాఖ్యానిస్తున్నారన్నారు.

అయితే పోలీసు భద్రత మీద తమకు నమ్మకం లేదంటూ ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర పోలీసుల మీద తమకు నమ్మకం లేదని, కేంద్ర భద్రత అవసరం అని కోర్టు వ్యాఖ్యాలు చేస్తుండడం బట్టి చూస్తే, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అర్థమవుతోందన్నారు. కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జయలలిత, ఇప్పుడు ఆ కేంద్రంలో ఉత్పత్తి ఆగిందంటూ, అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడం బట్టిచూస్తే, ఏ మేరకు అక్కడి ప్రజల్ని ఆమె మోసం చేస్తున్నారో అర్థం అవుతుందని ధ్వజమెత్తారు. అరాచకాలు పెరిగాయని, అవినీతి తాండవం చేస్తున్నదని పేర్కొన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా సరే, కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జయలలిత ప్రయత్నాల్లో ఉన్నారని, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలు పు నిచ్చారు. ఓటుకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు ఇస్తారని, అది ప్రజల సొమ్ము కాబట్టి, వాటిని అందరూ తీసుకోవాలని, ఓటు మాత్రం మంచి వాళ్లకు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకే కాదు...ఎంజీయార్‌కే పంగనామాలు పెట్టిన ఘనత జయలలితకు దక్కుతుందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని తరిమికొడుదామని పిలుపు నిచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMDK head  Vijayakanth  jayalalitha  

Other Articles