Pune Shocker : Man beheads wife, walks with her head in hand

Man seen walking with wife s head on pune road

Pune man beheads wife, Man Seen Walking With Wife's Head on Pune Road, Pune beheading,Ramachandra Chavan,Pune,man kills wife,Maharashtra

A 60-year-old man was seen walking on Pune road with wife's head

ITEMVIDEOS: దారుణం: భార్య తల చెత్తో పట్టుకుని వీధుల్లో నడిచిన భర్త..

Posted: 10/09/2015 05:42 PM IST
Man seen walking with wife s head on pune road

మహారాష్ట్ర రాష్ట్రంలోని ఫూనే నగరంలో దారుణం జరిగింది. ఆరవై ఏళ్ల వృద్దుడు.. పూణే వీధుల్లో తన భార్య తలను నరికి తన చేతిలో పట్టుకుని తీసుకెళ్తుండగా.. ఆ ఘటన చూసిన స్థానికులు నిశ్చేష్టులయ్యారు. ఫూణే నగరవాసి రామచంద్ర చవాన్ తన 55 ఏళ్ల సతీమణి పోనాబాయి తలతో ఊరేగుతున్న సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని తరువాత అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు. తనతో పాటు నాలుగు దశాబ్దాల పాటు సంసారం చేసిన సతిపై అపనమ్మకంతో.. కట్టుకున్న వాడే కాలయముడై అమెను కడతేర్చాడు. ఇంత చేసినా అతడి కసి తీరలేదు.. కిరాతక వృద్ధుడు ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో నరికేసిన తన భార్య తల పట్టుకొని.. నడివీధిలో నడుచుకుంటూపోయాడు.

మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన తాలుకు మొబైల్ వీడియో దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. 60 ఏండ్ల రామచంద్ర చవన్ వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు. తన భార్య (55)  ఎవరితోనో అక్రమ సంబంధం కలిగివుందనే అనుమానంతో గొడ్డలితో ఆమె తలను నరికేశాడు. అంతేకాకుండా ధోతి, కుర్తా ధరించిన అతను భార్య తలను ఓ చేతిలో, గొడ్డలిని ఓ చేతిలో పట్టుకొని నడివీధిలో నడుచుకుంటు వెళ్లడం చూసినవారిని దిగ్భ్రాంత పరిచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramachandra Chavan  Pune  man kills wife  Maharashtra  

Other Articles