No railway zone to Vizag| Railway board

No special railway zone to visakha clarifies railway board

railway zone to vizag, vizag railway zone, railway zone decision to vizag, AP special status ak mittal on vizag railway zone, state bifurcation bill railway zone, iyr krishna rao railway board

Railway board openly clarified that, there would be no special railway zone to Vizag.

విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ హుళ్లక్కే.! కుదరదని తేల్చిచెప్పిన రైల్వేబోర్డు

Posted: 09/30/2015 12:49 PM IST
No special railway zone to visakha clarifies railway board

ఆంధ్రప్రదేశ్‌ ఆశలపై కేంద్రం అన్ని విధాలుగా నీళ్లు చల్లుతొంది. రాజధాని లేని రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన బిజేపి నేతలు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక శోదా ఇవ్వడం కుదరదని చెప్పింది. ఆ విషయాన్ని పక్కనబెడితే..ఇటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కూడా కుదరదని  రైల్వే బోర్డు కుండబద్దలులు కోట్టింది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడం లేదని తేల్చి చెప్పేసింది.

ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక జోన్‌ అవసరం లేదని చెబుతూనే.. విశాఖ జోన్‌ వల్ల భువనేశ్వర్‌ తీవ్రంగా నష్టపోతుందని, అందువల్ల ఒడిశా నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నదని తెలిపింది. ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో తనతో భేటీ అయిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుకు రైల్వే బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... వైజాగ్‌లో రైల్వే జోన్‌ ఏర్పాటుచేస్తే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ (భువనేశ్వర్‌) ఆదాయం పడిపోతుందని, అయినా వైజాగ్‌లో జోన్‌ లాభదాయకం కాదన్న అభిప్రాయాన్ని మిట్టల్‌ వ్యక్తం చేసినట్లు తెలిసింది. సాంకేతిక అంశాలపరంగా చూస్తే ఏపీలో కొత్త జోన్‌ ఏర్పాటు చాలా కష్టమని తేల్చి చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాజకీయంగా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : railway zone to vizag  Vizag  Visakhapatnam  railway board  special status  

Other Articles