Five of 12 convicts in the 7/11 train blasts case sentenced to death

Mumbai 7 11 train blasts 5 get death 7 sent to life in prison

7/11 mumbai blasts case, MCOCA court, Maharashtra Control of Organised Crime Act (MCOCA), 7/11 blasts, Mumbai train blasts, 5 get death in 7/11 case, Serial Mumbai blatsts, 7/11 verdict, Mumbai Bomb Blasts, Ehtesham Sidduiqui, Asif Khan, Faisal Shaikh, Naveed Khan, Kamal Ansari, Death Sentence, Dr Tanveer Ansari, Mohammed Ali, Sajid Ansari Mohamad Majid Shafi, Muzzammil Shaikh, Soheil Shaikh, Zamir Ahmed Shaikh, Life Imprisonment, National news

Five convicts in the 2006 Mumbai local train bombings, which killed 188 people and injured over 800, were on Wednesday sentenced to death by a Mumbai special court.

ముంబై పేలుళ్ల కేసులో మోకా కోర్టు కీలక తీర్పు.. 5గురికి మరణదండన, 7 జీవితఖైదు...!

Posted: 09/30/2015 10:02 AM IST
Mumbai 7 11 train blasts 5 get death 7 sent to life in prison

దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై మహానగరంలో 7/11 వరుస బాంబు పేలుళ్ల కేసులో మోకా ప్రత్యేక కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దోసులుగా తేలిన మరో ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. 13 మంది నిందితుల్లో 12 మందిని కోర్టు ఈ నెల 11న దోషులుగా తేల్చింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విచారణాంతరం ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. న్యాయమూర్తి జస్టిస్ యతిన్ షిండే తీర్పును వెలువరిస్తూ.. ఈ పేలుళ్లు జరిగేందుకు వివిధ ప్రాంతాలలో బాంబులను అమర్చిన ఫైసల్ షేఖ్, అసిఫ్ ఖాన్, కమల్ అన్సారీ, ఏహ్తీషమ్ సిద్దిఖీ, నవీద్ ఖాన్ లకు మరణశిక్ష విధించారు.

ఈ బాంబు పేలుళ్లు సహకరించిన ఏడుగురికి జీవిత ఖైదు శిక్షను విధించింది. బాంబులు పేల్చేందుకు ఎటక్ట్రికల్ సర్క్యూట్స్ ను అమర్చిన మహ్మమద్ సాజిద్ అన్సారీ, తన గొవండి నివాసాన్ని బాంబుల తయారీకి వినియోగించేందుకు అనుమతించిన మహ్మమద్ అలి, ఇక బాంబు పేలుళ్ల కుట్రకు పన్నాగం పన్నిన డాక్టర్ తన్వీర్ అన్సారీ, మాజీద్ షఫీ, ముజామ్మిల్ షేక్, సోహెల్ షేక్, జమీర్ షేక్ లకు న్యాయస్థానం యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, మోకా కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని దోషుల తరపు న్యాయవాదులు ప్రకటించారు.

2006 జులై 11న ముంబై మహా నగరంలోని సబర్బన్ రైళ్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు 11 చోట్ల వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఖార్ రోడ్, బాంద్రా, మాతుంగా, మాహిమ్ జంక్షన్, జోగేశ్వరి, మీరా రోడ్, భయాందర్, బోరీవాలిల్లో 11 నిమిషాల తేడాలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల్లో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. కాలక్రమంలో మరో ఐదుగురు మరణించారు. అప్పటి నుంచి ఈ కేసులో నిందితులపై విచారణ సాగించిన మోకా న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. కాగా, ఈ దారుణ మారణకాండ నుంచి వెనువెంటనే కొలుకున్న ముంబయి మహానగరం.. తాము ఇలాంటి ఉగ్రవాద ఘటనలకు బెదరమని చాటిచెబుతూ.. మరుసటి రోజునే యధావిధిగా కార్యకలాపాలను సాగించిన తీరును అప్పట్లో దేశవిదేశాధినేతలు ప్రశంసించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 7/11 mumbai blasts case  MCOCA court  

Other Articles