Edward @Snowden's First Tweet: 'Can You Hear Me Now?'

Edward snowden is on twitter snowden

Edward Snowden joined Twitter, Snowden gets massive responce, Snowden first tweet, Snowden opens twitter account, Snowden tweets can you hear me now, edward snowden, twitter, nsa, Gizmodo

Edward Snowden just joined Twitter. Everyone’s favorite whistleblower and data privacy advocate is gaining followers fast, but is only following one account at current: the NSA.

ITEMVIDEOS: నా కూత వినబడుతుందా అంటూ ఎడ్వర్ట్ తొలి ట్విట్.. ప్రజావేగు పిట్టకు అనూహ్య స్పందన

Posted: 09/30/2015 12:27 PM IST
Edward snowden is on twitter snowden

ప్రపంచ దేశాలకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలను బట్టబయలు చేసి.. అగ్రరాజ్యం అమెరికా నుంచి పలు దేశాల వెన్నులో వణుకుపుట్టించిన ప్రముఖ ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. నా కూత.. నేను ఇప్పుడు మీకు వినబడుతున్నానా..? అంటూ అయన తొలి ట్విట్ చేశారు. ఇలా ఆయన తన ఖాతాను ప్రారంభించారో లేదో.. గంట వ్యవధి తిరిగే సరికి ప్రజావేగు అకౌంట్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రజా స్పందన వెల్లివిరుస్తుంది. 45 నిమిషాల్లో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్స్ పెరిగారు.

సామాజిక మాధ్యమం..ముఖ్యంగా మైక్రో బ్లాగింగ్ సైట్ ఖాతా ప్రారంభించినందుకు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయనకు ప్రస్తుతం పెరుగుతున్న ఫాలోవర్స్ సంఖ్య నిమిషానికి మూడు వేలమంది ఉన్నారు. తనకు అంతమంది ఫాలోవర్స్ పెరుగుతున్న స్నోడెన్ మాత్రం తొలిసారి అమెరికాకు చెందిన రక్షణ సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఎజెన్సీని ఫాలో అవడం విశేషం. ఆయన ఖాతా ప్రొఫైల్ వివరాల ప్రకారం ఫ్రీడాన్ఆఫ్ ప్రెస్కు ఆయన ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ట్విట్టర్లో స్నోడెన్ జాయిన్ అవడం పట్ల అన్ని దేశాలతోపాటు భారత్ కూడా ఆయన ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారా అని తీవ్ర ఆసక్తితో ఉంది. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 7.79 లక్షలుమంది ఉండగా మరో నాలుగు రోజుల్లో 50 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా.

అగ్రరాజ్యంగా వెలుగొందుతూ ఆ ముసుగులో అమెరికా చేస్తున్న అనేక అసాధారణ విషయాలను సీఐఏ మాజీ ఉద్యోగైన ఎడ్వర్డ్ స్నోడెన్‌ వెలుగులోకి తీసుకోచ్చిన విషయం తెలిసిందే. ఆయనను అరెస్టు చేయాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. ప్రపంచవ్యాప్త నిత్యం జరుపుతున్న ఫోన్ సంభాషణలు, ఛాటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్సింగ్‌లు, ఈమెయిల్స్‌పై అమెరికా నిరంతర నిఘా పెట్టిందని, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లే కాదు... క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల పిన్ నంబర్లు దొంగిలిస్తున్నదని ఆయన అమెరికా దుశ్చర్యలను చెప్పాడు. స్వపర భేదాలు కూడా లేకుండా నమ్మకస్తులైన మిత్రులుగా ఉంటున్న యూరోపియన్ యూనియన్ దేశాలపైనా, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియాలపైనా కూడా గూఢచర్యానికి పాల్పడుతున్నదని స్నోడెన్ వెల్లడించడం అమెరికా ద్వందనీతిని భట్టబయలు చేసింది. దీంతో అమెరికా నుంచి వెళ్లిన ఆయన కొంతకాలం అజ్ఞాతంలో వున్నారు. అప్పటి నుంచి అడపా, దడపా పలు దేశాలకు సంబంధించిన గుట్టును బయటపెడుతూనే వున్నారు. మళ్లీ సుమారు నాలుగు సంవత్సరాల తరువాత ఆయన సోషల్ మీడియాలో చేరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : edward snowden  twitter  nsa  Gizmodo  

Other Articles