'Puli' star Vijay's house raided by Income Tax Dept.; Is Ilayathalapathy victim of dirty politics again?

It raids on houses of samantha and vijay

tamil actor vijay,income tax department,puli,vijay house raided,it raids on nayantara,it raids on Samantha,vijay income tax,Ilayathalapathy Vijay, it raids on 25 premises of puli movie

Ilayathalapathy Vijay along with the houses of Nayantara and Samantha have been reportedly raided by the Income Tax Department on Wednesday, 30 September.

పులి చిత్రం నటీనటులపై పంజా విసిరిన ఆదాయశాఖ

Posted: 09/30/2015 11:09 AM IST
It raids on houses of samantha and vijay

తమిళ నటుడు విజయ్ ఇంటిపై ఆదాయపన్ను అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన నటించిన తాజా చిత్రం పులి గురువారం విడుదల కానున్న నేపథ్యంలో.. ఒక్క రోజు ముందుగా ఐటీ అధికారులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. విజయ్‌తో పాటు దక్షిణాధి చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు సమంత మరియు నయనతారల ఇళ్లలోనూ ఇవాళ ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. వీరితో పాటు పులి చిత్రం టీమ్ కు చెందిన మొత్తం 25 మంది ఇళ్లపై ఏకకాలంతో అదాయ శాఖ దాడులు నిర్వహించింది.

విజయ్ నటించిన తాజా చిత్రం ‘పులి’ సినిమాని నిర్మించిన శిబు సెల్వకుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. చెన్నై, కొచ్చి, మధురై, హైదరాబాద్ నగరాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలాండ్‌లో సూర్య సినిమా షూటింగ్‌లో ఉన్న సమంత, తన ఇంటిపై ఐటి దాడులు జరిగాయని తెలుసుకొని నివ్వెరపోయింది. అయితే సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించడం వెనకు అంతర్యమేమిటన్నది అదాయపన్ను శాఖ అధికారులు చెప్పడం లేదు. ఈ దాడులకు సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి వుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ilayathalapathy Vijay  nayantara  samantha  puli movie  IT raids  

Other Articles