AJA Activists Send 250 Hand Sanitizers To Mark Zuckerberg Remind Him Of 2002 Gujrat Riots | Modi America Tour

Aja activists send 250 hand sanitizers mark zuckerberg 2002 gujrat riots

aja activists, narendra modi updates, gujarat riots, 2002 gujarat riots, mark zuckerberg, facebook chief mark zuckerberg, modi with mark zuckerberg

AJA Activists Send 250 Hand Sanitizers Mark Zuckerberg 2002 Gujrat Riots : After Modi Meeting, Activists Send 250 Hand Sanitizers To Zuckerberg, Remind Him Of 2002 Gujrat Riots!

జుకెర్-బర్గ్ కు అంటిన ‘మోదీ’ (గుజరాత్ అల్లర్ల) నెత్తుటి మచ్చ!

Posted: 09/29/2015 10:54 AM IST
Aja activists send 250 hand sanitizers mark zuckerberg 2002 gujrat riots

గుజరాత్ లో అదో విషాద సంఘటన! 2002లో మోదీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు గోద్రాలో ముస్లింలను హిందువులు వెంటాడి, వేటాడి చంపేశారు. దాదాపు మూడురోజులపాటు జరిగిన ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ అల్లర్లు జరుగుతున్నప్పుడు సీఎం హోదాలో వున్న మోదీ ఎందుకు మౌనంగా వున్నారంటూ ఒకటే ప్రశ్నలు. ఆయన వల్లే అవి జరిగాయని ఒకటే పుకార్లు. అలా ఆ విధంగా ఆయన మీద పడ్డ ఆ నెత్తుటి మచ్చ.. ఇప్పటికీ ఆయన్ను వెంటాడుతూనే వుంది. ఆ సంఘటన జరిగి 13 ఏళ్లు గడిచినా, ఆ ఘటనతో మోదీకి ఎటువంటి సంబంధం లేదని కోర్టు తీర్పు ఇచ్చినా.. ఆ అల్లర్లు నెత్తుటి మచ్చ మోదీని ఇంకా విడిచిపెట్టలేదని, నీడలా వెంటాడుతూనే వుందని మరోసారి నిరూపితమైంది. ‘ఎప్పుడో జరిగిన ఆ ఘటన ప్రస్తావన ఇప్పుడు మళ్లీ తెరమీదకి ఎందుకు వచ్చింది’? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టి ఏడాదిపైనే అవుతోంది.. ఈ సమయంలో ఆయన ఎన్నో విదేశీ పర్యటనలు చేపట్టారు.. ఎంతోమంది ప్రముఖులతో భేటీ అయ్యారు.. ప్రధానిగా తన సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు.. కానీ గుజరాత్ అల్లర్ల ఘటన నుంచి మాత్రం ఇంకా బయటపడలేకపోతున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అక్కడ కొన్ని ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన విషయం తెలిసిందే! ముఖ్యంగా ఆదివారం ఆయన ఫేస్‌బుక్ ఆఫీసులో ఆ సంస్థ సీఈఓ జుకర్‌బర్గ్‌తో జరిపిన భేటీ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఆయనతో కరచాలనం చేయడం, సంభాషణ సమయంలో కంటతడి పెట్టడం ఎందరినో కలచివేసింది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. వారివురి భేటీ తర్వాత ఓ వివాదం తెరమీదకి వచ్చింది. వారిద్దరి భేటీ ముగియగానే ‘అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ’కి చెందిన కొందరు కార్యకర్తలు.. ‘జుకర్, నీ చేతులు కడుక్కో’ అని ప్రచారం ప్రారంభించారు. ‘నీ చేతికి అంటిన నెత్తుటి మచ్చని తుడుచుకో’ అంటూ ఆయనకు హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లను వందలాదిగా పంపాలని ప్రజలను కోరారు. ఇప్పటికే 250కి బాటిళ్లు పంపినట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi with zuckerberg  aja activists  

Other Articles