AP Former CM Nallari Kiran Kumar Reddy Brother Kishore Kumar Reddy To Join TDP Party Soon | Chandrababu Naidu Gossips

Kishore kumar reddy to join tdp party soon former cm kiran kumar reddy brother chandrababu naidu

kishore kumar reddy, nallari kiran kumar reddy, chandrababu naidu, tdp party updates, political gossips, kiran kumar reddy brother kishore, kishore in tdp party

Kishore Kumar Reddy To Join TDP Party Soon Former CM Kiran Kumar Reddy Brother Chandrababu Naidu : The Gossips Going Viral In Politics That AP Former CM Nallari Kiran Kumar Reddy Brother Kishore Kumar Reddy To Join TDP Party Soon. Chandrababu Has Already Given Green Signal For His Entry.

టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ సీఎం ‘నల్లారి’ సోదరుడు

Posted: 09/29/2015 11:13 AM IST
Kishore kumar reddy to join tdp party soon former cm kiran kumar reddy brother chandrababu naidu

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో గుర్తున్నారా! ఆయనేనండి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా చరిత్రపుటల్లోకెక్కిన వ్యక్తి. అంతేకాదు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తన సోదరులతో కలిసి ‘సమైక్యాంధ్ర’ పేరిట ఓ పార్టీని స్థాపించి తెగ హడావిడి చేశారు.  అయితే.. ఆ పార్టీకి కనీస ఓట్లు కూడా దక్కకపోగా కిరణ్ కుమార్ పత్తాలేకుండా వెళ్లిపోయారు. అప్పట్లో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయిలెండి. ఏదేమైనా.. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దాదాపుగా దూరమయ్యారు. కానీ.. ఇన్నాళ్ల తర్వాత ఆయన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయారు. ఆయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారాలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సొంత జిల్లా చిత్తూరులో సోదరుడు కిశోర్ కుమార్ అంతా తానై చూసుకునేవారు. రాష్ట్ర విభజన తర్వాత నల్లారి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీ టికెట్ పై కిశోర్ కుమార్ రెడ్డి తమ సొంత నియోజకవర్గం పీలేరు అసెంబ్లీ బరిలో నిలిచారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత అటు కిరణ్ తో పాటు కిశోర్ కూడా దాదాపుగా రాజకీయంగా కనుమరుగయ్యారు. అయితే.. ఇప్పుడు తాజాగా కిశోర్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికార టీడీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతకొన్నాళ్ల నుంచి కిశోర్ తిరిగి రాజకీయాల్లోకి వద్దామని ప్రణాళికలు చేసుకుంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆసక్తిని గమనించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా కిశోర్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా కిశోర్ రాణిస్తారో, లేదో చూడాలి.

ఇదిలావుండగా.. రాజకీయాల్లో కిశోర్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ వార్తలు రావడం మొదలైన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఎవరికి కనిపించకుండా కనుమరుగైన కిరణ్.. ఇప్పుడు తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. తన పార్టీని ఏదైనా విపక్ష లేదా అధికార పార్టీలో విలీనం చేసి, తన సత్తా చాటుదామని ప్లాన్ వేస్తున్నట్లు అంతర్గతవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి.. ఇందులో ఎంత వాస్తవం వుందో తెలీదు కానీ.. కిశోర్ టీడీపీ పుచ్చుకోవడం మాత్రం నిజమేనంటూ చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles