Death toll of Indians in Mecca's Hajj stampede rises to 35

Hajj stampede death toll of indian pilgrims in mecca rises to 35

hajj, mecca, stampede, india, indians, mecca stampede, hajj stampede, indians in mecca stampede, indians in hajj stampede, mecca hajj, mecca hajj stampede, mecca stampede death tolls, death toll mecca stampede, death toll hajj stampede, hajj stampede deaths, india news

Among those killed, 11 were from Gujarat, three from Tamil Nadu and one each from Telangana, Kerala, Jharkhand and Uttar Pradesh.

హాజ్ తోక్కిసలాటలో 35 కు చేరిన భారతీయ మృతుల సంఖ్య

Posted: 09/27/2015 07:27 PM IST
Hajj stampede death toll of indian pilgrims in mecca rises to 35

పవిత్ర హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు 769 మంది చనిపోగా 934 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన భారతీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఏడుగురు ఇండియన్లు చనిపోయినట్లు హజ్ కమిటీ గత రాత్రి ప్రకటించగా తాజాగా ఆ సంఖ్య మరింత పెరిగింది. మరో ఇరవై నాలుగు మంది కూడా మృతి చెందినట్లు వెల్లడించింది. ఈ 35 మందిలో ఐదుగురు కేరళకు చెందిన వారు కాగా మరో నలుగురు గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముస్లింలు ఉన్నారు.

జార్ఖండ్‌‌కు చెందిన ఇద్దరు, యూపీ, బీహార్ కు చెందిన వారు ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో ఈ మహా విషాదంలో భారతీయ మృతుల సంఖ్య 35కి చేరింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జెడ్డాలోని భారతీయ అధికారులు అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె వివరించారు. హజ్ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది ముస్లింలు తరలిరాగా భారత్ నుంచి లక్షన్నర మంది వెళ్లారు. ఐదు రోజుల పవిత్ర హజ్ యాత్ర శనివారంతో ముగిసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hajj  mecca  stampede  india  indians  mecca stampede  hajj stampede  

Other Articles