PM Narendra Modi Breaks Down Into Tears While Talking About His Mother When Zuckerberg Asked Question | Modi Silicon Valley

Pm narendra modi breaks down into tears while talking about his mother

narendra modi, facebook updates, mark zuckerberg, modi with zuckerberg, narendra modi talks about mother, modi in silicon valley, modi america tour, narendra modi controversy, facebook controversies

PM Narendra Modi Breaks Down Into Tears While Talking About His Mother : Facebook’s Town Hall Q&As — where Facebook users around the world get to ask Mark Zuckerberg questions - aren’t typically emotional events. This changed Sunday during a special Q&A Zuckerberg held with Indian Prime Minister Narendra Modi.

జుకెర్ బర్గ్ చిట్ చాట్ లో కంటతడి పెట్టిన మోదీ

Posted: 09/28/2015 10:24 AM IST
Pm narendra modi breaks down into tears while talking about his mother

ఇన్నాళ్లూ తన ప్రసంగాలతో దేశ ప్రజల్లో సరికొత్త చైతన్యాన్ని నింపుతూ వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. ‘ఫేస్ బుక్’ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్ తో జరిపిన చిట్ చాట్ సందర్భంలో ఆయన కంటతడి పెట్టిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. జుకెర్ బర్గ్ అడిగిన ఓ ప్రశ్న ఆయన్ను ఏడిపించింది. ఇంతకీ ఆ ప్రశ్నేంటి? ఆ ప్రశ్నకు, ఈయనకు సంబంధం ఏమిటి? అని అనుకుంటున్నారా..! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఫుల్ బిజీగా వున్న మోదీ.. ఆదివారం జుకెర్ బర్గ్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. తొలుత ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంలో వారివురు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరికీ సంతోషాన్నిచ్చింది. ఇక వారివురి మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలోనే జుకెర్ బర్గ్ మాట్లాడుతూ.. ‘మీకు, మాకు చాలా సారూప్యత వుంది. మనకు మన కుటుంబం చాలా ముఖ్యం. నా తల్లిదండ్రులు ఇక్కడే వున్నారు. మీ జీవితంలో కూడా మీ అమ్మగారు చాలా కీలకం కదా?’ అంటూ ప్రశ్నించారు. దీంతో తనను పెంచడానికి తన తల్లి పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్న మోదీ.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు.

‘‘నా జీవితంలో నా తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. మాది చాలా నిరుపేద కుటుంబం. నేను రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాడిని. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. మేం అప్పుడు చాలా చిన్న పిల్లలం. మమ్మల్ని పెంచేందుకు మా అమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో పనిమనిషిగా చేసేది. తన పిల్లలను పెంచడానికి ఒక తల్లి ఎంత కష్టపడాలో చూడండి. కేవలం ఒక్క నరేంద్ర మోదీ తల్లే కాదు, భారత్ లోని ఎంతోమంది తల్లులు తమ పిల్లలను పెంచడానికి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు ఇఫ్పుడు 95 ఏళ్లు. ఇప్పటికీ ఆమె తన పనులను తనే స్వయంగా చేసుకుంటారు’’ అని మోదీ చెప్పారు. ఈ మాటలు విన్న ప్రతిఒక్కరు భావోద్వేగానికి గురయ్యారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi tears  facebook controversy  mark zuckerberg  

Other Articles