tirumala devotees looted in guest house

Thieves hulchul in tirumala looted tamilnadu devotees

Thieves rob money and Gold, Money and jewellery robbed, Tirumala, Devotees, tamilnadu devotees robbed by thieves, tamilnadu kanchipuram devotees, tirumala kausthubam guest house 235 room number, Tirumala kautubham Guest house

Thieves rob money and Gold from Tamilnadu devotees at Tirumala kautubham Guest house

ITEMVIDEOS: శ్రీవారి కోండపై భక్తుల నిలువుదోపిడి.. దోంగల హల్ చల్

Posted: 09/24/2015 01:08 PM IST
Thieves hulchul in tirumala looted tamilnadu devotees

కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అంతేకాదు. ఇన్నాళ్లు తమలో వున్న శారీరక, మానసిక రుగ్మతలన్నీ వైదొలిగి.. అన్నింటా విజయం చేరూకుతుందని కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ మేరకు తమ స్వస్థలాల నుంచి ముడుపులు కట్టుకుని వచ్చి స్వామివారికి సమర్పిస్తుంటారు. మరికోందరు నిలువుదోడిపీ కూడా ఇస్తుంటారు. అయితే భక్తుల విశ్వాసాలకు భిన్నంగా తిరుమలలో దొంగలు హల్‌చల్‌ చేశారు. స్వామివారికి చెందాల్సిన నిలువుదోపిడీలను దొంగలు తమ వశం చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..


{youtube}v=SiLNg4qdccY|620|400|1{/youtube


తిరుమల వసతి గృహంలో సేద తీరుతున్న భక్తులకు మత్తుమందు ఇచ్చి అందినవరకు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం దొంగతనం జరిగినా బాధితులు గురువారం స్పృహలోకి రావడంతో విషయం తెలిసింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కౌస్తుభంలోని రూమ్‌ నెం. 235లో బస చేశారు. వారు విశ్రాంతి పొందుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వెళ్లి మత్తు మందు కలిసిన టీ తాగించారు. బాధితులు మత్తులోకి జారిపోయిన తర్వాత వారి వద్ద ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లిపోయారు. స్పృహాలోకి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఓ మహిళ ఇంకా మత్తులో ఉండడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala  Devotees  tamilnadu devotees  thieves  

Other Articles